వ్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవ‌డంతో పాటు ప‌ల్నాడును ర‌క్షించుకోవ‌డానికి ఈ నెల 11న ఛ‌లో ఆత్మ‌కూరు  కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు  తెలుగు దేశం పార్టీ ఆధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. పార్టీనేత‌ల‌తో చంద్ర‌బాబు టెలీకాన్ష‌రెన్స్ నిర్వ‌హించారు.  పార్టీ ఎప్ప‌టికీ ఒంట‌రిది కాద‌ని తెల‌ప‌డానికి ఆయ‌న ఈ  కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు.


తెలుగుదేశం పార్టీ  అంటే ఓ వ్య‌క్తి కాదు అది ఓ పెద్ద వ్య‌వ‌స్థ అని ఛ‌లో ఆత్మ‌కూర్ ద్వారా తెలుపుదాం అన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు నేత‌లంతా త‌ర‌లి రావాల‌న్నారు. పోలీసులు త‌మ పై పెట్టే ప్ర‌తీ కేసుకు స‌మాధానం చెప్పేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌న్నారు.  మాన‌వ‌హ‌క్కుల సంఘానికి త‌లుప‌డంతో పాటు ప్ర‌యివేటు కేసులు న‌మోదు చేద్దాం అన్నారు. 10వ తాదీన న్యాయ‌వాదుల స‌మావేశం నిర్వ‌హిస్తున్నాం అని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లీగ‌ల్ సెల్‌కి సంబంధించిన న్యాయ‌వాదులంతా దీనికి వ‌స్తారు. లీగ‌ల్‌సెల్‌ను ప‌టిష్ట ప‌రుద్దామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న దాడుల‌కు, అక్ర‌మ కేసుల‌కు లీగ‌ల్ సెల్ అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. కార్య‌క్త‌లు అంతా ధైర్యంగా ఉండాల‌ని త‌ద్వారా తెలిపారు. ఇక‌పై వీళ్ల ఆట‌ల‌ను సాగ‌నిచ్చేది లేద‌ని  ఇష్టానుసారం మ‌న‌ల్పి కొడ‌తామంటే ప‌డ‌టానికి సిద్ధంగా లేమ‌న్నారు.  ఎన్ని కేసులు పెడ‌తారో పెట్ట‌మ‌నండి నేను చూస్తా. అంద‌రి ముందు నేనుంటా... ముందు నా మీద కేసు పెట్ట‌మ‌నండి చూద్దాం అని అన్నారు.


బాబాయిని ఎవ‌రు చంపారో చెప్ప‌లేని వ్య‌క్తి మ‌న‌ల్ని భ‌య‌పెడ‌తారా అంటూ ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా ప‌డితే అలా కేసులు పెడితే ఊరుకునేది లేద‌ని బాధితుల‌కు బ‌స్సులు పెట్టి మ‌రీ ర్యాలాగా తీసుకెళ‌దాం అన్నారు. 10వ‌తేదీ రాత్రికి రాష్ట్ర వ్యాప్త బాధితులంతా పున‌రావాస కేంద్రానికి వ‌స్తే అక్క‌డి నుంచి వారి వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేలా చేద్దాం అన్నారు. బెదిరించి, భ‌య‌పెట్టి రాజ‌కీయం చేయ‌టం వైసీపీ నేత‌ల వ‌ల్ల కాద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: