రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన ఆరుగురు మంత్రుల పేర్లపై హర్షం వ్యక్తం‌ అవుతోంది. ఖరారు చేసిన పేర్లు  టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తోపాటుగా హరీశ్ రావు గారి పేరు కూడా ఖరారు అయ్యింది.  దీంతో పాటు గా రంగారెడ్డి జిల్లా కు నుండి  సబితా ఇంద్రా రెడ్డి గారిని కూడా మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ కు ఈ అవకాశం దక్కింది.  కరీంనగర్ నుంచి ప్రధానంగా గంగుల కమలాకర్ కు మంత్రి వర్గం లో చోటు లభించింది. వరంగల్ నుంచి సత్యవతి రాథోడ్ కూడా  మంత్రి వర్గం లో అవకాశం కల్పించారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ ఎస్ శ్రేణుల్లో ప్రధానం గా హర్షం వ్యక్తమవుతోంది.పార్టీ శ్రేణులతో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలకు సంబంధించి అలాగే అన్ని ప్రాంతాలకు సంభందించిన ప్రజలకు పూర్తి స్థాయి లో అవకాశం కల్పిస్తున్నట్టు ఆయా నాయకులకు  అవకాశం కల్పిస్తూ సముచితమైన గౌరవం లభించే విధంగా ఈ మంత్రి వర్గ కూర్పు జరిగింది  అభిప్రాయాన్ని అందరు కూడా వ్యక్తం చేస్తున్నారు. 


ఓ వైపు అనుభవానికి పెద్ద పీట వేస్తూనే మరో వైపు కొత్త తరాన్ని కూడా క్యాబినెట్ లోకి తీసుకురావడమనేది ఒక  మంచి మేళవింపుగా  ఉండని, సమగ్రమైన క్యాబినెట్ గా ఇది  రాష్ట్ర అభివృద్ధి కి దోహదపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాటిని మరింత వేగంగా మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తప్పకుండా ఈ క్యాబినెట్ విస్తరణ అన్ని రకాలుగా కూడా దోహదపడుతుందనే విశ్వాసం అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది.

అన్నిటి కంటే ముఖ్యంగా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంబంధించి గతంలో ఆయన నిర్వహించిన   ఐటీ, మున్సిపల్ శాఖలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును గతంలో సాధించారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను విజయవంతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అలాగే మంత్రి హారీశ్ రావు గారు కూడా చాలా  కీలకమైన పాత్ర రాష్ట్ర అభివృద్ధి లో పోషించారు. అలాగే గతంలో సమైక్య రాష్ట్రం లో కూడా మంత్రి గా పని చేసిన అనుభవం సబితా ఇంద్రా రెడ్డి గారి సొంతం ఆమెను కూడా మంత్రివర్గం లోకి తీసుకునేందుకు పూర్తి స్థాయి లో కసరత్తు చేసిన తర్వాత ఆమె పేరు ను ఖరారు చేశారు. 

అంతే కాక ఇద్దరు మహిళలకు కూడా ఈ సారి అవకాశం లభించింది, మంత్రి వర్గ విస్తరణలో సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించడం ద్వారా క్యాబినెట్ లో ఇద్దరు మహిళలకు  చోటు లభించింది.  దీంతో పాటుగా ఉత్తర తెలంగాణ లో అత్యంత కీలకమైన కరీంనగర్ జిల్లా కు సంబంధించి కరీంనగర్ పట్టణం కరీంనగర్ టౌన్ నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ కు ఈ సారి మంత్రి వర్గ విస్తరణ లో చోటు లభించింది.  బలహీనవార్గలకు  అవకాశం కల్పించాలనే ఆలోచన తో మంత్రి వర్గం లో తప్పకుండా అన్ని వర్గాలకు కీలకమైన అవకాశాలివ్వాలన్న ఆశతో గంగుల కమలాకర్ కి కూడా ఈ మంత్రి వర్గ విస్తరణ లో చోటు లభించినట్లు గా తెలుస్తోంది.ఈ‌ విధంగా కేసీఆర్ చాలా ముందు చూపుతో మంత్రి వర్గ విస్తరణ చేస్తినట్టు.


మరింత సమాచారం తెలుసుకోండి: