978 కోట్ల రూపాయల విలువగల చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగడానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రోతో తనకి ఉన్న కనెక్షన్ కోల్పోయింది. దానికి గల కారణం ఇంకా తెలియకపోయినప్పటికీ ఈ మిషన్ అంతటితో ముగియలేదు.


ఇస్రో అధికారి శివన్ మాట్లాడుతూ, "కేవలం ఐదు శాతం మాత్రమే నష్టం జరిగింది, మిగిలిన 95 శాతం  ఇప్పటికీ విజయవంతంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంది అదే ఆర్బిటర్.   ల్యాండర్ కు సంభందించిన  ఆచూకీనీ ఇప్పటికే అది కనిపెట్టింది ల్యండర్ తో తిరిగి కమ్యునికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని" తెలిపారు.


17 ఆగస్టు 1958 నుండి సెప్టెంబర్ 12, 1959 వరకు అమెరికా ఇంకా రష్యా చేరో  10 ప్రయత్నాలు చేశాయి కానీ 11 వ ప్రయత్నంలోనే ఇద్దరూ విజయవంతమయ్యారు. చంద్రుడిని చేరుకోవడంలో అమెరికా సాధించిన విజయాల రేటు 71.92 శాతం (58 లో 16 ఫెయిల్ అయ్యాయి)  కాగా, రష్యాలో 33.92 (52 లో  18 ఫెయిల్ అయ్యాయి) శాతం మాత్రమే ఉన్నాయి. భారతదేశం ఇప్పటికి చంద్రుని పైకి రెండు మిషన్లను పంపించాయి, రెండూ చేరుకున్నాయి. మరోవైపు, చైనా పంపిన మొత్తం 9 మిషన్ల లోనూ విజయం సాధించింది. ఇవన్ని చూస్తే  మిషన్ భారత దేశం‌ మంచి ప్రయత్నం చేసిందని తెలుస్తోంది.

చంద్రుని మీద దక్షిణ ధ్రువంలో ఇప్పటివరకు ఏ అంతరిక్ష సంస్థకు కూడా వెళ్ళలేక పోయింది అది చేసిన ఏకైక దేశం భారత్. చైనా, నాసా, రష్యా వారి అంతరిక్ష నౌకలను ఉత్తర భాగాన,  భూమధ్యరేఖ ప్రాంతానికి పంపించాయి.

చంద్రయాన్ -2 మిషన్ ఇప్పటివరకు  మిగతా మూడు దేశాల చంద్రుని మిషన్ ల కంటే చాలా తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యింది.  ఈ మిషన్ మొత్తం ఖర్చు 978 కోట్లు. అందులో 603 కోట్లు చంద్రయాన్ -2 ను తయరుచేయడానికి అయ్యాయి, మిగిలిన 375 కోట్లు దానిని చంద్రుని మీదకి పంపడానికి  జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె III రాకెట్ పై ఖర్చు చేయబడ్డాయి.

2379 కిలోల బరువున్న ఆర్బిటర్  చాలా ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తుంది. ఈ ఆర్బిటర్ బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐఎస్‌డిఎన్) తో కనెక్షన్ ఉంటుంది. ఇమేజింగ్ ఐఆర్ఎస్ స్పెక్ట్రోమీటర్ సహాయంతో ఆర్బిటర్‌పై అమర్చిన పేలోడ్ ఇక్కడ ఉపరితలంపై నీరు మరియు ఇతర ఖనిజాల ఉనికి గురించి డేటాను సేకరిస్తుంది. చంద్రయాన్ -2 లోని లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ ఉపరితలంపై పడే సూర్యకాంతి ఆధారంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌ను కనుగొంటుంది. 

ఈ‌ కారణాలన్నిటిని చూసుకుంటే చంద్రయాన్-2 ప్రపంచం‌ లోని ఇతర దేశాల మిషన్ లతో‌ పోలిస్తే ఇది చాల విజయవంతం అయ్యిందని చెప్పవచ్చు. శివన్ గారు చెప్పినట్లు వారు ల్యండర్ తో కమ్యునికేట్ చేయగలిగితే ఇది నూటికి నూరూ శాతం విజయవంతం‌ అయినట్టు.


మరింత సమాచారం తెలుసుకోండి: