కేశినేని నాని అని పేరు చెప్పగానే అతని బాధ అందరికి అర్ధం అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఆయనకు వైసీపీలో చేరాలని ఉన్న చెప్పలేక పోతున్నారని అంటున్నారు నెటిజన్లు. 


ఏమైందో తెలీదు .. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసి పదవికి రాజీనామా చేస్తా అని కూడా కేశినేని నాని అన్నాడు. 


దీంతో పక్క టీడీపీకి త్వరలో షాక్ తగులుతుంది అని అందరూ భావించారు. కానీ అయన పార్టీను మారలేదు, పదవికి రాజీనామాను చెయ్యలేదు. అయితే ఇప్పుడు మరోసారి కేశినేని పార్టీ మారుతారని అది కూడా వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆలా వార్తలు రావడానికి గల కారణం కేశినేని నాని అనే చెప్పచు. 


కేశినేని నాని నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ''అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని, విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేశినేని నాని అన్నారు. ఇలా అంటూనే 'నేను ఎవరినీ పొగడటం లేదు. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు.' అంటూ తనదైన శైలిని చూపించారు. 


ఆలా అన్నంత మాత్రానాప్రెస్ రాయకుండా ఉంటుందా ? ప్రత్యేక్ష ప్రసారాల్లో ప్రజలు చూడకుండా ఉంటారా ? ప్రెస్ వాళ్ళు రాసారు .. ప్రజలు టీవీల్లో, సోషల్ మీడియాలో చదివారు. ఇంకా ఇవన్నీ చుసిన నెటిజన్లు కామెంట్లు చెయ్యకుండా ఊరికే ఉంటారా ? ఉండరు అలానే నెటిజన్లు కామెంట్లు చేస్తూ 'ఏంటి కేశినేని .. నేను ఎవరిని పొగడటం లేదు అంటూనే జగన్ ని ఆకాశానికెత్తవు.. త్వరలో వైసీపీలో చేరుతున్నావా ?' అంటూ కామెంట్లు చేశారు. మరి కేశినేని నాని నిజంగా పార్టీలో చేరుతారా ? లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: