గవర్నమెంట్ ప్రాజెక్టు అంటే ఇప్పుడు మొదలైతే పుష్కరకాలం కూడా పూర్తి కాదు అన్న విషయం అందరికీ తెలిసినదే. అదే మెట్రో వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే అది ఎన్ని దశాబ్దాలు పొడిగించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక పార్టీ వచ్చి వచ్చే ఎలక్షన్లో మేము పూర్తి చేస్తాను అంటే మరొక పార్టీ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేస్తామని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాయి.

బెంగుళూరు సిటీ లో కూడా మెట్రో పనులు పూర్తిగా జరగడం లేదు అని ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ ఉంటారని ప్రజల్లో కోపం పెరిగి పోతుంది. అందుకే ఎడ్యూరప్ప నేను 2020లో గా బెంగళూరు మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయిస్తాను అని బెంగళూరు ఒక ఎలక్ట్రానిక్ సిటీ గా మార్చి వేస్తాను అని హామీలు ఇస్తున్నారు.

బెంగళూరు పేరు చెబితేనే అందరూ బెంబేలెత్తి పోతారు అక్కడ రోడ్డుపైన ప్రయాణం చేయడం కంటే ఇంట్లోనే కూర్చోవడం నయమని ఉద్యోగానికి వెళ్లి వారైతే తొమ్మిదింటి ఉద్యోగానికి పొద్దున్న ఆరింటికి బయలుదేరిన చేరుతారో లేదో లేదు అని వాపోతున్నారు. మెట్రో పనులు పూర్తయి రైళ్లు మొదలు అయితే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశిస్తుండగా అది ఎన్నేళ్లయినా ఒక ఎన్నికల నుంచి మరొక ఎన్నికల వరకు హామీలు కోసం ఉపయోగపడుతుంది కానీ బెంగళూరు ప్రజలకు ఎటువంటి ఉపయోగానికి రావట్లేదు అని ప్రజలు మనస్థాపం చెందుతున్నారు.

హైదరాబాదులో జరిగినంత విస్తారంగా బెంగళూరులో మెట్రో ప్లాన్ లేదు కానీ ఒకటో రెండో రూట్లు మొదలైన కూడా ట్రాఫిక్ ఎంతో మేలు జరుగుతుంది అని అందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి సమయంలో బెంగళూరు ఎంత ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలను పక్కన పెట్టి డెవలప్మెంట్ చేయాలని అందరూ భావిస్తున్నారు. అయితే ఏకంగా మ్యాజిక్ చేసినట్టుగా 2020కి నేను ఈ పని పూర్తి చేస్తాను అని ఎడ్యూరప్ప అంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: