ఏపీలో జగన్ విజయం ప్రభంజనం. జగన్ అధికారంలోకి వచ్చి కనీసం 6 నెలలు కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేనట్టుంది. అర్ధం పర్థం లేకుండా విమర్శిస్తున్నారు. జగన్ ను విమర్శించకూడదని ఇక్కడ చెప్పడం లేదు. కానీ జగన్ కు కొంత సమయం ఇచ్చి విమర్శిస్తే ప్రజల్లో వారికీ గౌరవం కూడా పెరుగుతుంది. నారా లోకేష్ ఈ మధ్య పెద్ద పెద్ద  డైలాగులు చెబుతున్నారు. ఇన్ని రోజులు సహించాము  .. ఇక సహించం వంటి పెద్ద డైలాగులు లోకేష్ చెబుతున్నారు. నిజంగా ఇవన్నీ వినడానికి చాలా కామెడీగా అనిపిస్తుంది. లోకేష్ .. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అర్హత లేదు. ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ ఈ విధంగా మాట్లాడి ఇంకా కామెడీ అవుతున్నారు.


లోకేష్ కు ఉన్న అర్హత కేవలం చంద్రబాబు తనయుడిని .. అది చూసుకొనే కనీసం కొంత మంది నేతలైన మాట వరసకి పలకరిస్తారు. ప్రభుత్వానికి వార్నింగ్స్ ఇవ్వటం ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కూడా ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఈ వారింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ లోకేష్ .. కార్యకర్తల భేటీలోనే చెప్పగలడు. నారా లోకేష్ ఇన్ని రోజులు ట్విట్టర్లో రాజకీయాలు చేశారు.


ఎక్కడ మీడియా ముందుకు వస్తే కామెడీ అయిపోతానమేనని లోకేష్ కు తెలుసు కాబట్టి ట్విట్టర్ లో రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్ ను పార్టీ నాయకుడిగా ప్రాజెక్ట్ చేయడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరడం లేదు. ఎన్నికలప్పుడు లోకేష్ బయటికి వచ్చి చేసిన కామెడీ షో ఇంకా అందరికి గుర్తున్నాయి. అయితే ఎన్నికలో ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ను చంద్రబాబు టీడీపీ లీడర్ గా ప్రాజెక్ట్ చేయడానికి .. ప్రజల్లోకి రుద్దడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. అయితే లోకేష్ మీడియా ముందుకు వచ్చి ఏది మాట్లాడబోయి ఏం మాట్లాడతాడేమోనని టీడీపీ నాయకులూ కూడా జంకుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: