ఏపీ సీఎం పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆయన చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా తీసుకున్న నిర్ణయాలు కొన్ని నభూతో.. నభవిష్యత్ అనేలా ఉంటున్నాయి. అలాంటిదే ఓ మైనారిటీకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు.


విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమే.. అంజాద్ బాషా చెప్పినట్టు మైనారిటీలకు ఇంత ప్రయారిటీ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. వాస్తవానికి చెప్పాలంటే.. ఉప ముఖ్యమంత్రి పదవి వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.. దాన్ని ఆరోవేలు అంటూ చరిత్రలో కొందరు పాత ముఖ్యమంత్రులు తీసిపారేశారు కూడా.


కానీ ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది ఓ గౌరవం.. అధికారంతో సంబంధం లేకుండా అదో హోదా.. అలాంటి గౌరవం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు.. ఇటీవలి కాలంలో చెప్పుకోవాల్సి వస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీకి అవకాశం ఇచ్చారు. అయితే అది తెలంగాణ కాబట్టి ఏపీలో ఆ పని చేసిన మొదటి సీఎం జగనే అవుతారు.


డిప్యూటీ సీఎం ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించి వై యస్‌ ఆర్‌ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైయస్‌ఆర్‌ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్‌ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: