అధికారంలో ఎవరు వచ్చినా పేదలు బతుకుల్లో పెద్ద మార్పులు కనిపించవు.. వాళ్ల బతుకుల్లో పెద్ద మార్పులు లేనప్పుడు ఎవరు పాలకులుగా ఉన్నా వాళ్లకు ఒరిగిందేమీ ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు తప్ప పేదోడు పెద్దగా ఈ పాలకుల గురించి ఆలోచించడు.. తన స్వశక్తినే నమ్ముకుంటారు.. లేదంటే తన తలరాత ఇంతే అనుకుని ఊరుకుంటాడు.


కానీ ఇప్పుడు ఆ పేదోడి బతుకుల్లో స్పష్టమైన మార్పు కనిపించే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో పేదోడు రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే అదో పెద్ద ప్రహసనంగా ఉండేది.. రేషన్ షాపు ఎక్కడో దూరంగా ఉంటుంది. కొందరు కిలోమీటర్లు కాలినడకన వెళ్తారు.. తీరా వెళ్లాక ఆషాపు తెరిచి ఉంటుందో మూసి ఉంటుందో తెలియదు.


ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పేదళ్లకు ఈ కష్టాలు లేవు.. ఇప్పుడు రేషన్ బియ్యం ఏకంగా ఇంటికే వస్తున్నాయి. జిల్లాలో బియ్యం బ్యాగులు ప్రజల ఇళ్లకే తీసుకు వెళ్లి ఇవ్వడం కొత్త అనుభవంగా చెబుతున్నారు. గ్రామ వాలంటీర్లు.. బియ్యం పంపిణీ చేయడంతో పాటు బియ్యం బాగోగుల గురించి కూడా వాకబ్ చేస్తున్నారు. ఎక్కువ చోట్ల బియ్యం బాగున్నాయని చెబుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల తడిసిన బియ్యం కావడంతో ఉండలు కట్టాయని అంటున్నారు.


అలా వచ్చినవారు ఆ విషయం చెప్పడంతో వలంటీర్లు వాటిని మార్చి కొత్త బ్యాగులు ఇచ్చారు. బియ్యం చాలా బాగున్నాయని పేదల నుంచి అభినందనలు వస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని నాని విమర్శించారు. గతంలో బియ్యం కోసం రేషన్ షాపుల వద్దకు వెళ్లవలసి వచ్చేదని,ఒక్కోసారి కిలోమీటర్ల కొద్ది ఒకటికి రెండుసార్లు తిరగవలసి వచ్చేదని ,ఇప్పుడు ఆ బాధ తప్పిందని.. జగనూ.. నువ్వు సూపర్ అని పేదలు మెచ్చుకుంటున్నారు. ఇదే కదా.. అసలైన మార్పు అంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: