రాజకీయాల్లో ఎవరి పిలక ఎవరి చేతుల్లో ఉంటుందో చెప్పలేం. అందుకే రాజకీయ నాయకులంతా గాజుగదుల్లో  ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు. ఒక్క రాయి వేస్తే చాలు భళ్ళున బద్దలవుతుంది ఆ గాజు మందిరం. అంతటి సున్నితమైన జీవితం రాజకీయ జీవులది. బయటకు ఎంతో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పినా ఎటునుంచి ముప్పు పొంచి ఉందో అన్న టెన్షన్ తో ప్రతీ రోజూ నరకమే. ఇదిలా ఉండగా దేశంలోని మెజారిటీ రాజకీయ జీవుల జాతకాలు ఇపుడు మోడీ చేతుల్లోకి వచ్చాయా.


అంటే స్విస్ బ్యాంక్ నివేదిక సాక్షిగా అవుననే అంటున్నారు. స్విస్ బ్యాంక్ తాజాగా నల్ల కుబేరుల జాబితాను మోడీ సర్కార్ చేతికి అందించిందంట. ఈ  జాబితాలో కళ్ళు జిగేల్మనే పేర్లు ఎన్నో ఉన్నాయట. ఈ దేశంలోని పేదల కడుపులు కొట్టి సంపాదించిన పాపపు సొమ్ముని స్విస్ బ్యాంకుల్లొ దాచి హాయిగా నిద్రపోతున్న నల్ల కుబేరులకు ఇపుడు కంటి నిండా కునుకు ఉండదు, ఎందుకంటే ఆ సీక్రేట్లన్నీ ఇపుడు కేంద్రం వద్దకు వచ్చేశాయి.


నల్లకుబేరుల మొదటి జాబితాను తాజాగా స్విస్ బ్యాంకుల నుంచి సేకరించి అక్కడి ప్రభుత్వం మోడీ సర్కార్ కి అందచేసింది. దేశంలో నల్లధనం వెలికితీస్తాం, ఎక్కడ డబ్బు దాచుకున్నా వెనక్కి తెప్పించి వాటిని పేదల ఖాతాల్లో వేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా మోడీ తదితర నాయకులు వూదరగొట్టి అధికారంలోకి వచ్చారు. వచ్చాకా ఆ వివరాలు బయటపెట్టమంటే స్విస్ బ్యాంకుల వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. వారు ఇవ్వడం లేదని కూడా దీర్ఘాలు  తీశారు.



అయితే అప్పటి నుంచే అడుగుతూంటే ఇపుడు స్విస్ ప్రభుత్వం ఆ వివరాలు అందచేసింది. అందులో రాజకీయ నాయకుల జాబితాలు, జాతకాలు కూడా ఉన్నాయట. మరి మోడీ ఆ వివరాలు కనుక ఆధారం చేసుకుని పొలిటికల్ అణుబాంబు పేలిస్తే ఎవరు మటాష్ అవుతారో చూడాలి. ఈ దేశంలో మెజారిటీ నాయకులకు స్విస్ ఖాతాలు ఉన్నాయన్న సంగతి సామాన్యులకు కూడా తెలుసు. మరి మోడీదే ఇక ఆలస్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: