భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని తాకింది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ ల్యాండింగ్ అయిందని సమాచారం. ఇస్రో ఛైర్మన్ కె శివన్ చంద్రుని ఉపరితలంపైన ల్యాండర్ ను గుర్తించినట్లు తెలిపారు. విక్రమ్ చంద్రునిపై ల్యాండ్ అవటంతో దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ ఘనత సాధించింది. చందమామ పైకి చేరిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధించింది. 
 
ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ ల్యాండర్ ఆచూకీని గుర్తించటంతో పాటు థర్మల్ ఇమేజ్ కూడా తీసినట్లు శివన్ తెలిపారు. ల్యాండర్ విక్రమ్ క్లిక్ ఇమేజ్ ఇంకా అందాల్సి ఉందని అవి అందితే మరింత స్పష్టత వస్తుందని శివన్ చెప్పినట్లు సమాచారం. రోవర్ ప్రఙాన్ కూడా ల్యాండర్ లోనే ఉండిపోయిందని శివన్ చెప్పారు. ఇస్రో బృందం ప్రస్తుతం రోజులో 17 గంటల సమయం పాటు డేటా సేకరణ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 
 
మరో 96 గంటల్లో ల్యాండర్ కు సంబంధించిన స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉందని ఇస్రో నుండి సమాచారం లభిస్తోంది. ప్రస్తుతం 14 కమిటీలు ల్యాండర్ విక్రమ్ కోసం అన్ని కోణాల్లో పరిశీలనలు జరిపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్బిటర్, ల్యాండర్ మధ్య సమాచార వ్యవస్థను పునరుధ్ధరించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అతి త్వరలో సాధిస్తామని ఆశాభావాన్ని శివన్ వ్యక్తం చేశారు. 
 
అంతరిక్ష నిపుణులు ఒకరు ల్యాండర్ కు నష్టం జరిగి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి డేటాను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ల్యాండర్ విక్రమ్ తో కమ్యూనికేషన్ వ్యవస్థలో మాత్రమే సమస్యలు ఉంటే పునరుధ్ధరించే అవకాశం ఉన్నట్లు ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: