మూడు రోజుల క్రితం చంద్రుని దరిదాపుల్లోకి వచ్చి గొప్ప విజయాన్ని నమోదు చేసిన ఇస్రో చాంద్రయాన్-2 కి వెల్లువలా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఇస్రోది ఘనమైన విజయమని కొమ్ములు తిరిగిన అంతరిక్ష పరిశోధనా  సంస్థలే కీర్తిస్తున్నాయి. చంద్రుని వద్దకు చాంద్రయాన్-2  రావడమే ఇస్రో మేలి మలుపు విజయమని కూడా అంటున్నారు. ఇస్రో అంకితభావం కూడా వెల్లడైందని అన్న వారూ ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇస్రోకు కొండంత బలాన్ని ఇచ్చే విధంగా తాజా పరిస్థితులు   ఉన్నాయి.


ఇస్రోతో కలసి తాము అంతరిక్ష పరిశోధనలు సంయుక్తంగా  చేస్తామని తాజాగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (నాసా) ప్రకటించింది. ఇస్రో సాధించినది మామూలు విజయం కానే కాదని ఆకాశానికెత్తేసింది. చంద్రుని దరిదాపుల్లోకి వెళ్ళడం ద్వారా ఇస్రో తన కలను నెరవేర్చుకుందని కూడా చెప్పింది.ఇక అంతరిక్ష పరిశోధన బహు కఠినమని కూడా పేర్కొంది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్ -2ని నిలపాలనుకోవడమే అతి పెద్ద విజయమని కూడా పేర్కొంది. తాము ఇస్రో అంకితభావాన్ని కొనియాడుతున్నామని కూడా పేర్కొంది. రానున్న రోజుల్లో ఇస్రోతో కలసి సంయుక్తంగా అంతరిక్ష పరిశోధనలు జరుపుతామని కూడా వెల్లడించింది.


ఇస్రోతో కలసి సౌర వ్యవస్థలోని రహస్యాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము సిధ్ధంగా ఉన్నామని కూడా నాసా ప్రకటించంది. తొలి ప్రయత్నంలోనే చంద్రునిపైన దిగలేకపోయినా ఇస్రో చేసిన మహత్తర ప్రయత్నం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది, ఇస్రో తన లక్ష్యాలను ఎప్పటికైనా సాధించి తీరుతుందని  కూడా నాసా అభిప్రాయపడింది. ఇస్రో అంతరిక్ష పరిశోధనలు తమకు కూడా ఎంతగానే ఉపయోగపడతాయని కూడా చెబుతోంది. మొత్తానికి ఇస్రో క్రుంగిపోకుండా నాసా ఇచ్చిన ఈ బూస్టప్ తో మరిన్ని పరిశోధనలకు రెడీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇకపై ఇస్రో దూకుడుని అంతా చూడొచ్చు మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: