వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అంద‌రికీ సుప‌రిచితులే. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కుమారుడుగా ఆయ‌న గుర్తింపు పొందారు. సౌమ్యుడు, వివాద ర‌హితుడు పెద్ద‌గా ప్ర‌చారం కోరు కోని నాయ‌కుడుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలాంటి బాధ్య‌త అప్ప‌గిం చినా.. తూచ త‌ప్ప‌కుండా చేసుకుపోవ‌డ‌మే ఆయ‌న ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా భావిస్తారు. రాజంపేట నుంచి వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌యం సాధించిన మిథున్ రెడ్డికి జ‌గ‌న్ గ‌ట్టి బాధ్య‌త‌లే అప్ప‌గించారు. పార్ల‌మెంటులో లోక్‌స‌భా ప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న‌ను నియ‌మించారు.


అయితే, ఇది జ‌రిగి కూడా రెండు మాసాలు పూర్త‌య్యాయి. అయితే, ఇటీవ‌ల ఓ నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో .. మిథున్ రెడ్డి.. ఈ బాధ్య‌త‌లను త‌న వ‌య‌సు మించిన బాధ్య‌త‌లుగా చెప్ప‌డం సంచ‌ల‌నం గా మారింది. ఆయ‌న కాంటెస్ట్‌లో చెప్పాలంటే.. ప్ర‌స్తుతం ఏపీ అనేక స‌మస్య‌ల్లో ఉంది. ముఖ్యంగా ప్ర‌త్య‌క హోదా స‌హా పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు తీసుకురావ‌డం, వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు రాబ‌ట్ట‌డం, కేంద్ర ప‌థ‌కాల‌ను తీసుకురావ‌డం అనేది ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కీల‌కం. ఈ క్ర‌మంలో అటు రాజ్య‌స‌భ‌లోనూ, ఇటు లోక్‌స‌భ‌లోనూ కూడా వైసీపీ ఎంపీల‌కు కీల‌క పాత్ర ఉంది.


రాజ్య‌స‌భ‌లో అయితే ఒకింత సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. లోక్‌స‌భ‌లో మాత్రం చాలా మంది జూనియ‌ర్లు ఉన్నారు. అస‌లు రాజకీయాలే తెలియ‌ని వారు కూడా జ‌గ‌న్ సునామీలో గెలుపు గుర్రం ఎక్కి పార్ల‌మెం టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరంద‌రినీ ఏక‌తాటిపై న‌డిపించి , కేంద్రాన్ని ఆయా అంశాల విష‌యంలో ఒప్పించ‌డం అనేది త‌న అనుభ‌వానికి స‌వాలుగా మిథున్ రెడ్డి ఫీల‌వుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న జాతీయ మీడియాతోనూ పంచుకున్నారు.


అయితే, వాస్త‌వానికి లోక్‌స‌భా ప‌క్ష నాయ‌కుడుగా మిథున్ ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ప‌నుల‌ను మాత్రం రాజ్య‌స‌భ స‌భ్యుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి చూసుకుంటున్నారు. అయినప్ప‌టికీ.. మిథున్‌లో ఆవేద‌న మాత్రం పోలేదు. ఏదేమైనా చిన్న‌వ‌య‌స్సులోనే పార్టీలో మిథున్ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాడ‌నే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: