ఇండియా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 లోని ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగే క్రమంలో మరో 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సిగ్నల్ అందకపోవడంతో.. ఏమైందో తెలియక ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు.  ల్యాండర్ ల్యాండింగ్ కాలేదని.. కూలిపోయి ముక్కలయ్యి ఉంటుందని చాలామంది కారుకూతలు కూశారు.  ఇస్రో ఎక్కడా తగ్గలేదు..ఆత్మస్తైర్యం కోల్పోలేదు.  విక్రమ్ కోసం గాలింపు మొదలుపెట్టారు.  ఆర్బిటర్ ల్యాండర్ జాడకోసం జాబిల్లిని జల్లెడవేసింది.  చివరకు విక్రమ్ జాడను కనుగొన్నది.  


దానికి సంబంధించిన ఫోటోను ఇస్రోకు పంపింది.  విక్రమ్ ముక్కలు కాలేదని సేఫ్ గా ఉందనే వార్త తెలియడంతో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీలయ్యారు.  విక్రమ్ అనుకున్న ప్లేస్ కు 500 మీటర్ల దూరంలో హార్ట్ ల్యాండ్ అయ్యిందని, ఒక పక్కకు ఒరిగిందేగాని ముక్కలు కాలేదని, త్వరలోనే సిగ్నల్స్ ను తీసుకొస్తామని ఇస్రో ప్రకటించింది.  ఇస్రో చేసిన ఈ ప్రకటన దేశంలోని ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని ఇచ్చింది.  మొదటిసారి చేపట్టిన ప్రయోగం... విక్రమ్ హార్ట్ గా ల్యాండ్ అయినా తిరిగి... తప్పకుండా సిగ్నల్స్ పంపుతుందనే నమ్మకంతో ఉన్నారు.  


అయితే, పాక్ మాత్రం ఈ విషయంలో గుర్రుగా ఉన్నది. విక్రమ్ సిగ్నల్స్ కోల్పోయిన తరువాత పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఇండియాపై అనుచిత వ్యాఖలు చేసిన సంగతి తెలిసిందే.  చేతకాకపోతే చేతులు ముడుచుకూర్చొవాలి అంతేగాని, కోట్లాది రూపాయలు ఇలా అనవసరంగా వృధా చేయడం ఏంటని ప్రశ్నించింది.  ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పార్లమెంట్ ను మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉచిత సలహా ఇచ్చారు.  


పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలోనే వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు చంద్రయాన్ 2 పై విక్రమ్ ల్యాండ్ అయినట్టు ఇస్రో ప్రకటించింది.  అయితే హార్ట్ ల్యాండ్ అయినట్టు చెప్పింది.  మరి దీనిపై పాక్ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.  విక్రమ్ నుంచి సంకేతాలు తిరిగి ప్రారంభమయ్యి.. రోవర్ కిందకు దిగితే.. అక్కడి పరిస్థితులను పరిశోధన చేస్తే .. పాక్ ఎలా స్పందిస్తుంది. పాక్ మంత్రి తలను ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: