పసిడి ప్రియలకు ఉరటనిస్తూ భారీగా తగ్గుతుంది బంగారం ధర. ఇటీవల అమాంతం దేశీయ మార్కెట్లో దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. డిమాండు లేకనో లేక రూపాయి బలపడటం తదితర కారణాల వల్ల బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 300 తగ్గి రూ. 39,225 పలికింది.                                                    


ఇక వెండి ధర కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 1400 తగ్గి రూ. 49వేల దిగువకు పడిపోయింది. ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 48,500గా ఉంది. అధిక ధరల కారణంగా గత కొంతకాలంగా రిటైల్‌ మార్కెట్లో బంగారం విక్రయాలు చాల వరుకు తగ్గుమొకం పట్టాయి.                                  


దీంతో ఆభరణాల తయారీదారుల నుంచి చాలావరకు డిమాండు పడిపోయింది. అటు దేశీయ కరెన్సీ రూపాయి పుంజుకోవడంతో ఈ లోహాల ధరలు తగ్గడానికి కారణమైందని దేశీయ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ప్రజలు బంగారం, వెండిపై మండిపడుతున్నారు. అమాంతం అయిదారు వేలు పెంచి వంద రెండు వందలు బంగారం తగ్గించి భారీగా తగ్గింది అని రాస్తున్నారని విరుచుకుపడుతున్నారు. మరి కొంతమంది .. ఎంతో కొంత తగ్గింది కదా ఇప్పుడు పెరగడం లేదు కదా సంతోషించు అంటూ కామెంట్లు చేస్తున్నారు.               


మరింత సమాచారం తెలుసుకోండి: