ప్రపంచంలో కొన్ని కొన్ని అద్భుత సంఘటనలు మనకు తెలిసిన,వాటిగురించి అంతగా పట్టించుకునే అలవాటు చాల మందికి వుండదు.ఆ మనకెందుకులే అని వదిలేస్తాం. ముఖ్యంగా మన భారతీయుల ఘనత గురించి అసలే ఇంట్రెస్ట్ చూపం ఎందుకంటే మనకు మన ఇంట్లో చికెన్ ఉన్నా పక్కింటి పుల్లకూరనే కావాలి.మనకు పెళ్లై భార్యవున్నా పక్కోడి పెళ్లాంవైపే చూపులుంటాయి.అది నేచర్ చేసిన అలవాటో లేక మనస్సు చేసిన అలవాటో అర్ధం కాదు.ఇక మన ఘనత గురించి ఎదుటివారు చెప్పేవరకు మనకే తెలియదు.ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మనందరం రోజు బస్సెక్కి మన అవసరాలు తీర్చుకుంటున్నాం,కాని దాన్ని తయారుచేసినప్పుడు మొట్టమొదట ఎక్కడ తిప్పారో టక్కున చెప్పండి.ఆలోచిస్తున్నారు కదూ.ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు.ఐతే తెలుసుకుందాం పదండి..



కామన్‌గా మనం ఎప్పుడు చూడని కొత్త వాహనం ఏదైనా రోడ్ల మీదా కనబడినప్పుడు చాలా ఆశ్చర్యంతో దానివైపే చూస్తాం. అలాంటింది భారతదేశంలో తయారయిన మొదటి బస్ మన తెలుగు నేలపై తిరిందంటే ఆనాటి ప్రజలు ఎంత ఆశ్చర్యపడి ఉంటారో ఊహించండి.అలాగే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు,కాబట్టి మన తెలుగు ప్రజలకి దక్కిన ఒక గుర్తింపు ఇక ఈ మొట్టమొదటి బస్సు బెజవాడ-మచిలిపట్నం మద్యలో తిరిగింది.ఇదే ఇండియాలో తిరిగిన మొదటి బస్సుగా రికార్డ్ సృష్టించింది.ఇప్పటికి ఈ బస్ నమూనా లండన్ మ్యూజియంలో చాలా భద్రంగా దాచారట.ఈ బస్సు నడిచిన కొన్ని సంవత్సారాల తరువాత బెజవాడలో కేశినేని వెంకటయ్య,కేశినేని ట్రావెల్స్ ని మొదలుపెట్టారు.ఇప్పటికి ఈ ట్రావెల్స్ బస్సులు మన ముందు తిరుగుతూనే ఉన్నాయి.చూసారుగా మన తెలుగు నేల ఔన్నత్యం..



ఇక మరోవిషయం ఏంటంటే 1903లో సిమ్సన్ అండ్ కంపెని తరపున జాన్ గ్రీన్ ఆవిరితో నడిచే కారును నిర్మించి తెలుగు నేలపై నడిపారు.ఎప్పుడు కారును చూడని ప్రజలకు అది రోడ్ పైకి వస్తుందంటే అద్భుతంగా అనిపించేదట.దీని గురించి మద్రాస్ మెయిల్ పత్రిక,ఇండియాలో నిర్మించిన మొదటి మోటర్ వెహికల్ అని పోగడ్తలతో ముంచింది.. అందుకే అంటారు ఏ దేశమేగినా ఎందు కాలిడినా,ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా,పొగడరా నీతల్లి భూమి భారతిని,నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని.. అందుకే విదేశీయులు,భారతీయులంటే పడిచస్తారు..ఎందుకంటే మన జ్ఞానము వారికి విజ్ఞానముగా మారింది కాబట్టి..

మరింత సమాచారం తెలుసుకోండి: