కొత్తగా వచ్చిన మోటార్ చట్టం వల్ల కుయ్యో మొర్రో అంటూ వాహనచోదకులు వేలకు వేలు చలానాలు కడుతుంటే… నాగపూర్ సిటీ పోలీసులు మాత్రం నువ్వు సిగ్నల్స్ బ్రేక్ చేసినా కూడా మేము ఎలాంటి ఫైన్ కట్టించుకోము అని ఒకరికి బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం అని కోపం వచ్చిందా? ఒక నిమిషం ఆగండి..! వాళ్ళు ఎందుకు అలా అన్నారో వింటే మీరు కూడా సంతోషిస్తారు. నాగపూర్ పోలీసులు ఇస్రో... చంద్రాయన్-2 యొక్క విక్రమ్ ల్యాండర్ ను గుర్తించిన తర్వాత ఒక ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. అందుకు సంబంధించిందే ఇప్పటివరకు మనం ప్రస్తావించింది అంతా.


"డియర్ విక్రమ్ దయచేసి స్పందించు. నువ్వు సిగ్నల్స్ బ్రేక్ చేశావని మేము నీకు ఎలాంటి చలననా రాయబోము…" అంటూ నాగపూర్ పోలీస్ వేసిన ట్వీట్ పిచ్చ వైరల్ అయిపోయింది. నిన్ననే విక్రమ్ ల్యాండర్ యొక్క స్థితి తెలిసిందని ఇస్రో చెప్పిన విషయం విదితమే. ఇక పోతే పొలీసులు వేసిన ట్వీట్ ను చాలా మంది అభినందించారు. "అవును 133 కోట్ల భారతీయుల ఆశలు కూడా విక్రమ్ కి ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చలానా వేయకూడదు. కానీ మీరు సూపర్ అంటూ" ఒకతను ట్వీట్ చేశాడు. విక్రమ్ లాండర్ కనిపించకుండా పోయిన తర్వాత మొత్తం భారతదేశం చింతించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈ ట్వీట్ అందరినీ బాధను కొంచెం మర్చిపోయి ఉల్లాసాన్ని ఇచ్చింది.

ఇకపోతే విక్రమ్ ల్యాండర్ నుండి ఇస్రో మళ్లీ సిగ్నల్స్ పొందేందుకు చాలానే ప్రయత్నిస్తూ ఉంది. గుడ్ న్యూస్ ఏమిటంటే విక్రమ్ లాండర్ విరిగిపోకుండా చంద్రుడి పైన అలాగే ఉంది. కానీ అది నిటారుగా లేకుండా ఒక పక్కకి ఒరిగి ఉండడంవల్ల శాస్త్రవేత్తలకు సిగ్నల్స్ పంపించడం లేదా అది మన వాళ్లు పంపుతున్న సిగ్నల్స్ ను తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఏది ఏమైనా మన నాగపూర్ పోలీసులు భలే ట్వీట్ వేశారు కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: