సెప్టెంబర్, 10 వ తేదీన  పండుగలు, జాతీయ దినాలు సూచిస్తే  హర్యానా, పంజాబ్  రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాయి . ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కూడా. ఇక ఈనాటి  సంఘటనలు విషయానికి వస్తే..కాన్స్టాంటినోపుల్ లో 1509లో ఇదే రోజున భూకంపం సంభవించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయాన  కెనడా ఆలీస్ జట్టులో చేరింది. దానితో జెర్మనీపై1939లో  కెనడా యుద్ధం ప్రకటించింది. స్విజర్లాండ్ 2002 సంవత్సరాన  ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకుంది. 
ఈనాటి జననాలు విషయంలో పరిశీలిస్తే.. ఒక ప్రముఖ నాయకుడు గోవింద్ వల్లభ్ పంత్ 1887 జన్మించారు. అయన భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో కీలకంగా వ్యవహరించారు. ఈయన 1961 లో అశువులు బాశారు.  "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1895 లో పుట్టారు. ఆయన   1976 మరణించారు.  పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు ఓగిరాల రామచంద్రరావు 1905 లో జన్మించారు. ఈయన 1957 లో మృతి చెందారు.



ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు కల్యంపూడి రాధాకృష్ణ రావు 1920 జన్మించారు. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య 1921 లో పుట్టారు. అయన 1992 లో మరణించారు. ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ 1922 లో జన్మించారు. ఈయన 1985 లో మృతి చెందారు.  సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి జి. వి. సుబ్రహ్మణ్యం 1935 లో పుట్టారు. 2006 లో మరణించారు.  విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణ 1935 జన్మించారు. ఈయన 1998 లో మరణించారు.  భారతీయ చిత్ర దర్శకుడు మరియు చిత్ర రచయిత అనురాగ్ కశ్యప్ 1972 లో పుట్టారు.  భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు చిన్మయి 1984 లో జన్మించారు. ఈమె  సినీ గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి కూడా. దక్షిణ భారత నటి కేథరీన్ థెరీసా  జననం 1992 లో జరిగింది.  




ఇక మరణాల అంశాన్ని పరిలిస్తే.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ దండు నారాయణ రాజు 1944 మృతి చెందారు. ఈయన జననం 1889 లో జరిగింది.  తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ 1985 లో మరణించారు. జనగామ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన ఈమె 1919 లో జన్మించారు.  కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు పొట్లపల్లి రామారావు 2001 లో ఈ రోజున మరణించారు. అయన 1917 లో జన్మించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: