రాజకీయాలలో అపరచాణిక్యుడు, దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలలో సీనియర్ నేత, ప్రస్తుత ప్రతి పక్షనేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్లిరోజు నేడు. సరిగ్గా 1980 సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడు పెళ్లి జరిగింది. అయన రాజకీయ ఎదుగుదలకి మూలా కారణం ఆ పెళ్లి అనే చెప్పచు. 


స్వర్గీయ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ముద్దల కూతురు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తరువాత కట్నం కింద ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేశాడు తారక రామ రావు. ఆ నాటి నుంచి ఈ నాటి వరుకు తనదైనా శైలిలో చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదుగుతూ వచ్చాడు. అయితే ఈ రోజు పెళ్లి రోజు కావడం వల్ల అతని సుపుత్రుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా శుభాకాంక్షలు చెప్పాడు. 


నారా లోకేష్ ట్విట్ చేస్తూ ''ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు.'' అంటూ అమెరికాలో పర్యటించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: