టీడీపీ పార్టీ ఎప్పుడు లేనంత వీక్ గా తయారైంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ కంచుకోటలను కూడా వైసీపీ బద్దలు కొట్టింది. వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఒక పక్క జగన్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంటే జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. ఎన్నికలో ఘోర ఓటమి .. వైసీపీకి అఖండ విజయం ఇవన్నీ కలిసి ఇప్పుడు జగన్ సంచలన నిర్ణయాలు ఇవన్నీ కలిసి జగన్ ను ఒంటరిగా ఎదుర్కోవటం సులభం కాదని చంద్రబాబుకు అర్ధం అయ్యింది. నిజానికి బాబుకు ఎన్నికలో ఒంటరిగా వెళ్లే దమ్ము, ధైర్యం లేదు. టీడీపీ చరిత్ర చూసుకుంటే ప్రతిసారి సారి ఎన్నికలో ఎదో ఒక పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేది.


కానీ 2014లో జనసేనతో బేడీస్ కొట్టేసరికే ఒంటరిగా భరిలో దిగింది. చావు దెబ్బ తిన్నది. అయితే చంద్రబాబు మళ్ళీ పాత  స్నేహాలను వెతుక్కునే పనిలో పడ్డారు. జనసేనతో కలిసి జగన్ ను ఎదుర్కోవాలని బాబు ప్లాన్. 2014 ఎన్నికల తరువాత కూడా బాబు .. పవన్ తో ఇదే చెప్పారు. మనం గాని ఎన్నికలో ఓడిపోతే కలిసి జగన్ మీద పోరాడాలని ! ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి కలిసి పోరాడతారని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత .. జనసేనతో కలిసిపోవాలని టీడీపీ తెగ ట్రై చేస్తుంది. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఒక ఏడాది ముందు టీడీపీ మీద విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఎన్నికలో ఇటు జనసేన, టీపీడీ పార్టీలు రెండు ఘోరంగా ఓడిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేన, టీడీపీ కలిసి పోతుందా .. అనే సందేహాలు వస్తున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: