గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైసీపీ అరాచకాలు చేస్తోందంటూ తెలుగుదేశం కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ సర్కారు బాధిత శిబిరమంటూ గుంటూరులో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది.. రేపు చంద్రబాబు నేతృత్వంలో బాధితులంతా ఆత్మకూరు చేరుకుంటారని టీడీపీ చెబుతోంది.


చలో పల్నాడుపై మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం నేతలు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారంటున్నారు. ఆత్మకూరు నుంచి దళిత కుటుంబాలను వెలివేస్తే వెల్లగొట్టిన వారి పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. బాధితుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని హోంమంత్రి అనటం బాధాకరమంటున్నారు.


టీడీపీ శిబిరం పెట్టే వరకు అక్కడ పోలీసులకు క్షేత్ర పరిస్థితులు తెలీదని.. వైకాపా పోటీ శిబిరం పెట్టడం సిగ్గు చేటని వారు అంటున్నారు. జగన్ పాలన లో ఎవరూ సురక్షితంగా లేరని వైకాపా నేతలు పోలీసులకు రాసివ్వాలంటూ... కాల్వ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడు అంటున్నారు. అంతే కాదు.. వైసీపీ సర్కారుకు టీడీపీ 10 డిమాండ్లు ఉంచింది.


అవేంటంటే..

1). ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

2). ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలి.

3).బీళ్లు పెట్టిన భూములకు పరిహారం ఇవ్వాలి. ఈ ఏడాది పంట కోల్పోయిన బాధిత రైతులకు కవుళ్లు చెల్లించాలి.


4).బాధిత గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలి, పోలీసు పహరా పెంచాలి.

5). పెట్రోలింగ్ బృందాలను పెంచాలి, సిసి కెమెరాలతో భద్రత కల్పించాలి.

6). నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి.


7). రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.

8).ఎక్కడ ఏ స్వల్ప ఘర్షణ జరిగినా వెన్వెంటనే స్పందించాలి.

9).ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయని చోట్ల వెంటనే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయాలి

10).ఫిర్యాదులు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా బాధితుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారులను వెంటనే బదిలీ చేయాలి. వారిపై యాక్షన్ తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: