అక్కడి వరకు బాగానే మానేజ్ చేసాడు.. కానీ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దైర్యం సరిపోలేదు. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. విమానాశ్రయంలో పోలీస్ తనిఖీల్లో అసలు రంగు బయట పడింది. కదా కమిష్ ఏంటంటే.. గుజరాత్‌లోని అహ‍్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్‌గా మార్చుకున్నాడు. అయితే  అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ రాజ్‌వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా సమాధానం చెప్పడంతో అనుమానించారు.


ఇంకేముంది అసలే పోలీసులు.. ఆపైన వారి డేగకల్లు..కనిపెట్టేసారు. ఇంకేముందిఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పాపం చక్కగా వేషం మార్చుకుని గుట్టుచప్పుడు కాకుండా    విదేశాలకు చెక్కేద్దామనుకున్నాడు. అందుకు అనుగుణంగా నకిలీ పాస్‌పోర్ట్‌ను కూడా తయారు చేసుకున్నాడు. జయేశ్ పటేల్ (32)  81  ఏళ్ల  వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్‌ చైర్‌ ఇలా అన్ని హంగులతో  సీనియర్‌ సిటిజన్‌లా దర్జాగా న్యూయార్క్‌కు పయనమయ్యాడు.




కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బందికి  అతగాడి వాలకాన్ని చూసి అనుమానించారు. పాస్ పోర్ట్ లోని వయస్సును మనిషిని చూస్తే ఏమాత్రం పోతన కుదరటంలేదు. దానికి తోడు  అతని ప్రవర్తనను చూసి మరింత అనుమానం కలిగింది. ఇంకేముంది అసలు విషయాన్నీ పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అతని పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి  చేరుకున్నాడు. వేషం మారింది కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉందన్నట్టుగా ముపైరెండేళ్ల బుల్లోడు దొరికిపోయాడు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: