తెలంగాణ బడ్జెట్ ప్రభావం ఏపీలో అధికార పార్టీపై పడుతుందా, అసలు సంబంధమే లేని విషయంలా కనిపించొచ్చు కానీ కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ జగన్ పై ఒత్తిడి పెంచుతుందని మాటలు వినిపిస్తున్నాయి. రెండూ వేరు వేరు రాష్ట్రాలు అయినా సంక్షేమ పథకాలు అమలు విషయానికి వచ్చేసరికి రెండింటి మధ్య పోలిక చూస్తారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ బడ్జెట్ జగన్ పై కొంత ఒత్తిడి పెంచడంలో అనుమానమే లేదు. మిగతా శాఖల్లోనూ ఇదే పరిస్థితి, కొన్ని చోట్ల రాత్రి ఎనిమిది గంటల వరకు కార్యాలయాల్లోనే ఉంటూ అధికారుల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. కానీ ఆర్ధిక మాంద్యం పరిణామాలతో ఆదాయం పెరుగుతున్న దాఖలా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓటాన్ బడ్జెట్ తో పోల్చుకుంటే తాజా బడ్జెట్ లో దాదాపు ఇరవై శాతం కోత విధించారు. నిజానికి ఓటాన్ అకౌంట్ కంటే పూర్తి స్థాయి బడ్జెట్ విలువ ఎక్కువగానే ఉంటుంది.


కానీ కేసీఆర్ అర్భాటాలకు పోదల్చుకోలేదు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు అంకెల్ని సవరించుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఓపెన్ గానే చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఫలితంగా తెలంగాణపైన మాంద్యం ప్రభావం ఉందని అందుకే బడ్జెట్ లో కోతలు విధిస్తున్నామని అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోల్చుకుంటే పూర్తి స్థాయి బడ్జెట్ లో కేసీఆర్ కోతపెట్టారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అన్ని విషయాల్లో దూకుడు చూపించినట్టే జగన్ బడ్జెట్ లో కూడా దూకుడు చూపించారు. నవరత్నాలు అమలు చేస్తామంటూ భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ తో పోల్చుకుంటే పంతొమ్మిది శాతం అధికంగా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లతో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నవరత్నాల్లో ముఖ్యమైన పథకాలన్నీంటికీ భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ దన్నుతో అధిక ఆదాయం తెలంగాణకు ఉంది.


ఏపిలో ఆదాయ మార్గాలు అతి తక్కువ, కాని బడ్జెట్ చూస్తే తెలంగాణ కంటే ఏపీ బడ్జెట్ అధికంగా ఉంటుంది. పెద్ద నష్టం కదా అని సరిపెట్టుకున్న తాజా బడ్జెట్ తో అసలు ఈ లెక్కలపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేశం ఆర్ధిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. పద్దెనిమిది నెలలుగా జిడిపి తగ్గడమే తప్ప పెరగడం లేదు. ఈ ప్రభావం అన్ని రాష్ట్రాల పైన ఉంటుంది, ఈ విషయాన్ని కేసీఆర్ అంగీకరించారు. అందుకు తగ్గట్టుగా లెక్కలు సరిచేసుకున్నారు, బేషజాలకు పోకుండా ఆర్భాటాలకు వెళ్లకుండా బడ్జెట్ ను దాదాపుగా ఇరవై శాతం తగ్గించుకున్నారు. భవిష్యత్ లో ఆదాయం పెరిగితే లెక్కలు సరిచేస్తామన్నారు. వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ చెప్పారు. కానీ ఏపీలో మాత్రం అలాంటివేవీ దృష్టి లోపెట్టుకున్నట్టు కనిపించలేదు.


దేశం మొత్తమ్మీద ఆదాయం తగ్గుతుంటే ఏపీ ఒక్క రాష్ట్రంలో పెరగడం సహజం కాదు, కానీ బడ్జెట్ లెక్కలు మాత్రం పైపైకే చూపిస్తున్నాయి. ఇసుక కొరతతో ఏపిలో నిర్మాణ రంగం కుదేలైంది, దీంతో సిమెంట్, స్టీల్ కు డిమాండ్ పడిపోయింది. వీటిపై ఇరవై ఎనిమిది శాతం పన్ను వసూలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా డిమాండ్ పడిపోవటంతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు నవరత్నాలతో పాటు అనేక పథకాల కోసం భారీగా నిధులు అవసరం ఉంది. మరి ఆదాయ వ్యయాల మధ్య సమతూకం ఎలా పాటిస్తారు అన్నది అంతుబట్టని విషయం. ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టాలంటే భారీగా ఆదాయం కావాలి, అంటే పన్నుల వసూళ్లు కావాలి. దీంతో ప్రభుత్వ పెద్దలు వాణిజ్య పన్నులు రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖకు టార్గెట్ లు పెడతారు.


దశలవారీ మద్య నిషేధంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గుతుంది. నిర్మాణ రంగం కుదేలైంది కాబట్టి రిజిస్ర్టేషన్ ఆదాయం కూడా నేల చూపులు తప్పవు, వాణిజ్య పన్నులది ఇదే దారి, ఇలాంటి సమయంలో వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పన్ను వసూళ్ల టార్గెట్ తో ఏపీలో అధికారులు ఇప్పటికే టెన్షన్ తో ఉన్నారు. రిజిస్ర్టేషన్ల శాఖ నాలుగు నెలల్లో రెండు వేల రెండు వందల పదకొండు కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంటే సమకూరింది మాత్రం కేవలం పదిహేడు వందల ముప్పై మూడు కోట్లు. మిగతా శాఖల్లోనూ ఇదే పరిస్థితి, కొన్ని చోట్ల రాత్రి ఎనిమిది గంటల వరకు కార్యాలయాల్లోనే ఉంటూ అధికారులు లెక్కలతో కుస్తీ పడుతున్నారు.


కానీ ఆర్ధిక మాంద్యం పరిణామాలతో ఆదాయం పెరుగుతున్న దాఖలాలు మాత్రం లేదు. టార్గెట్ లు సాధించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. జగన్ నవరత్నాలకు హామిల అమలుకు నిధులు కేటాయిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను సవరించారు. అంటే ధనిక రాష్ట్రమని చెప్పుకొనే తెలంగాణ అంచనాల్ని తగ్గించుకుంటే విభజనతో ఆర్థికంగా కుదేలైన ఏపీ మాత్రం లేనిపోని లెక్కలు ఊహించుకుంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ బడ్జెట్ లెక్కలతో ఏపీలో ఆర్థికశాఖ పునరాలోచనలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ లెక్క జగన్ పై ఒత్తిడి పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: