బ్రెగ్జిట్ వ‌ద్దంటూ బ్రిట‌న్ ఎంపీల మ‌ధ్య బేధాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబ‌ర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ పెట్టిన ప్ర‌తిపాద‌న రెండ‌వ సారి కూడా వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌లో ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌మ స్వ‌రాన్ని సైలెంట్ చేశార‌ని వారు ఆరోపించారు. ఎన్నిక‌ల అంశాన్ని ప్ర‌తిప‌క్ష ఎంపీలు వ్య‌తిరేకించారు.ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ పెట్టిన తీర్మానికి 293 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. కానీ మూడ‌వ వంత మెజారిటీ కోసం కొన్ని ఓట్లు త‌క్కువ‌య్యాయి. బ్రిటీష్ పార్ల‌మెంట్‌ను అయిదు వారాల పాటు స‌స్పెండ్ చేశారు. మ‌ళ్లీ అక్టోబ‌ర్ 14వ తేదీన పార్ల‌మెంట్ స‌మావేశం కానుంది.


బ్రిట‌న్లో బ్రెగ్జిట్ అంశం దీర్ఘ‌కాలంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే.  బ్రెగ్జిట్​పై 2016లో రెఫరెండం నిర్వహించగా, ఎక్కువమంది ప్రజలు యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు రావాలనే కోరుకున్నారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో  బ్రెగ్జిట్ పై ఎటూ తేల్చుకోలేని విధంగా​సంక్షోభం ఏర్పడటంతో ప్రస్తుత ప్రధాని థెరెసా మే జూన్​ 7న రాజీనామా చేశారు. కొత్త ప్రైమ్​ మినిస్టర్​నియామకం వరకూ ఆమె టెంపరరీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.  అనంత‌రం బ్రిటన్ ​కొత్త ప్రధాన మంత్రిగా లండన్​మాజీ మేయర్, బ్రెగ్జిట్​కు హార్డ్​కోర్​ సపోర్టర్​ అయిన బోరిస్​జాన్సన్​ అధికార పగ్గాలు చేపట్టనున్నారు. రూలింగ్ కన్సర్వేటివ్​పార్టీ లీడర్షిప్​కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్ ఘన విజయం సాధించారు.​  ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ కు 46,656 ఓట్లు రాగా, జాన్సన్​కు 92,153 ఓట్లు పడ్డాయి. దీంతో బ్రిటన్​కన్సర్వేటివ్​ పార్టీ లీడర్​గా, తద్వారా  ప్రధానిగా జాన్సన్​నియామకం ఖరారు అయింది. 


బ్రెగ్జిట్​(యూరోపియన్​యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లేందుకు)కు జాన్సన్​ మొదటి నుంచీ గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. తనను ప్రధానిని చేస్తే.. వేర్పాటు ఒప్పందం లేకుండా లేదంటే ఏదో ఒక డీల్ తో అయినా.. బ్రెగ్జిట్​సాధిస్తానని, అక్టోబరు 31 డెడ్​లైన్​నాటికి బ్రిటన్​ను తప్పకుండా యూరోపియన్​యూనియన్​నుంచి బయటకు తీసుకొస్తానని జాన్సన్ హామీ ఇచ్చారు.జాన్సన్ రూలింగ్​ పార్టీ లీడర్ గా ఎన్నికైనందున, బుధవారం ఆమె బకింగ్ హాం ప్యాలెస్​లో క్వీన్​ఎలిజబెత్​–2ను కలిసి  బాధ్యతల నుంచి తప్పుకొంటారు. ఆ వెంటనే కొత్త ప్రధానిగా జాన్సన్​ను బ్రిటన్​ రాణి అధికారికంగా నియమిస్తారు. అయితే, కన్సర్వేటివ్​ పార్టీకి బ్రిటన్ పార్లమెంటులో మెజారిటీ లేదు. అందువల్ల నార్తర్న్​ ఐర్లాండ్​కు చెందిన బ్రెగ్జిట్ కు మద్దతు తెలిపే డెమొక్రటిక్ యూనియనిస్ట్​పార్టీ నుంచి 10 మంది ఎంపీల మద్దతు ఉంటేనే ప్రభుత్వం కొనసాగుతుంది. మరోవైపు  డీల్​లేకుండా బ్రెగ్జిట్ కు తాము అంగీకరించబోమని, అలా జరిగితే రాజీనామా చేస్తామంటూ పలువురు మంత్రులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: