జూనియర్ ఎన్టీఆర్ పేరు .. టీడీపీ పార్టీలో కొద్దీ రోజుల నుంచి జోరుగా వినిపిస్తుంది. ఘోర పరిస్థితిలో ఉన్న టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందేనని టీడీపీలో కొంత మంది ఆరోపిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఎక్కడ తమ అడ్రస్ గల్లంతు అవుతుందోనని కొంత మంది ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన చెందే వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ వారే. మొన్న బాలయ్య అల్లుడి వ్యాఖ్యలతో తెలిసిపోయింది. ఎక్కడ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీని ... కార్యకర్తలను తన చేతిలోకి తీసుకుంటాడని భయపడుతున్నారు. 2019 ఎన్నికలో టీడీపీ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో ఓటమి పాలైంది.


ఎన్నికల కౌంటింగ్ ఒక్క రోజు ముందు కూడా చంద్రబాబు నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఖంగు తిన్నాడు. పలు సభల్లో కూడా ఇంత ఘోర ఓటమి రావటానికి నేనేమి తప్పు చేశానని చెప్పిన సంగతీ కూడా తెలిసిందే. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు.  అయితే టీడీపీ ఓటమి .. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పార్టీలోని కొంత మంది నేతలు భహిరంగానే చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పై పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేదన్న సంగతీ తెలుస్తుంది. మొన్న బాలయ్య చిన్న అల్లుడు భరత్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: