చంద్రబాబు చేసే కొన్ని వ్యాఖ్యలు నిజంగా బాబు గారికి మైండ్ పని చేస్తుందో లేదా .. లేక అధికార దాహం ఈ రేంజ్ లో ఉందా అన్న సందేహం రాక మానదు. ప్రజలు రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య సీట్ల తేడా ఏ 20 లేదా 30 లేవు. జగన్ విజయం అఖండ విజయం. చంద్రబాబుది ఘోర పరాజయం. మరీ కేవలం వంద రోజుల్లోనే ప్రజలు ఎన్నికలు కావాలనుకొని బాబు గారిని ఎందుకు ఎంచుకుంటారు. బాబు గారిని భరించలేకే కసితో జనాలు ఓట్లేసి జగన్ ను గెలిపించారు. కానీ చంద్రబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా అధికార వ్యామోహం పోలేదని తేటతెల్లమవుతుంది. 


2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రధానంగా దెబ్బ తీసిన వాటిల్లో ఒకటి గ్లోబల్ ప్రచారం. అబద్దాన్ని నిజం చేయడం .. దానికి పచ్చ మీడియా అబ్బో ఓహో అంటూ డప్పు కొట్టడం. పూర్తి చేయని హామీలను 90 శాతం పూర్తి చేశామని చెప్పడం ఇవన్నీ ప్రజలకు చిరాకు తెప్పించాయి. ప్రజలను ఎలాగైనా మోసం చేసి మీడియా అండతో ఎన్నికలో బాబు గారు గెలవాలని ప్లాన్ చేశారు. కానీ చివరికి 30 ఏళ్లలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చవి చూశారు.


గత ఐదేళ్లలో పరిపాలనలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన ప్రతి పక్షమైన వైస్సార్సీపీని బలహీన పరచడానికి రాజకీయ వ్యభిచారం చేశాడని చెప్పాలి. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా ! అన్నీ గమనించి జగన్ కు కనీ వినీ ఎరుగని రీతిలో బ్రహ్మాండలైన మెజారిటీని ఇచ్చి బాబుకు గుణపాఠం నేర్పారు. ఫిరాయించిన నేతల వల్ల ఉపయోగం లేదని .. చివరికి ప్రజలు ఛీ కొడతారని చంద్రబాబు అనుభవం పసిగట్టలేకపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: