గత ఎన్నికల్లో టిడిపి అతి ఘోరపరాజయం చూసిన తర్వాత రాష్ట్రమంతా ఇక చంద్రబాబు నాయుడు తిరిగి పుంజుకుంటాడని ఆశలు వదులుకున్నట్లున్నారు. టిడిపి అభిమానులకి నారా లోకేష్ మీద అసలు ఏ ఉద్దేశం లేకపోయే. మరి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఎవరు తీసుకు వస్తారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఈ విషయం పైన టిడిపి నేతలు వ్యవహరించిన తీరు మొదటి నుంచి తేడాగానే ఉంది.

మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ అయితే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పేసాడు. అసలు ఎన్టీఆర్ గురించి ఎక్కువ సేపు మాట్లాడడానికి కూడా ఆయన ఆసక్తి చూపించలేదు. తరువాత లోకేష్ మాటలు కూడా మనం వింటే వారు ఎవరూ ఎన్టీఆర్ పార్టీలో చేరడం పట్ల సుముఖంగా ఉన్నట్లు లేరు. ఇదిలా ఉంచితే తాజాగా ఒక టిడిపి మహిళా నేతను ఇంటర్వ్యూలో ఇలాగే ఎన్టీఆర్ అవసరం పార్టీలో ఎంతమేరకు ఉంది అని అడుగగా ఆమె అసలు ఎన్టీఆర్ పార్టీకి ఏం చేశాడు… ఇప్పుడు పల్నాడు లో అంత పెద్ద గొడవ పడుతుంటే వచ్చి కనీసం తమకు మద్దతుగా ఒక్కమాట మాట్లాడాలి అని అనడం గమనార్హం.

ఆమె చెప్పిందేమిటంటే... జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అతనికి ఉన్న లక్షలాది మంది అభిమానులు పక్కనపెడితే ఆయన అవసరం పార్టీకి ఎంతవరకు ఉంది... ఆయన కొత్తగా వచ్చి ఇక్కడ చేసేది ఏముంది అన్న దాని గురించి మనం ఆలోచించాలని అన్నారు. అసలు ఎన్టీఆర్ కూడా పార్టీలోకి రావాలని అనుకోవాలి కదా. ఇప్పుడు పల్నాడులో అంత పెద్ద గొడవ జరుగుతుంటే... అతను తమ పార్టీ అనుకొని అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడం... వంటి పనులు ఏమీ చేయకుండా ఉంటే మీరు అసలు అతనికి తమ పార్టీ పైన ఆసక్తి ఉందని ఎలా అంటారు అని ఆమె అన్నారు. 

అందుకు యాంకర్, ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తే వచ్చి మాట్లాడుతారని ఇవ్వకపోతే ఎలా మాట్లాడుతారు అని సూటిగా అడిగేసింది.  దీంతో చిర్రెట్టిపోయిన మహిళా నేత… ఎన్టీఆర్ కు తమ పార్టీలో పదవి, ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఎవరు చెప్పారు..? కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వచ్చి పార్టీ తరఫున ప్రచారం చేశారు కదా… మళ్లీ ఇప్పుడు ఏమైంది అంటూ ఆమె అన్నారు. తర్వాత జరిగిన పరిస్థితులను గురించి కూడా మనకు తెలుసు అని యాంకర్ చెప్తుండగా.... మీకు ఎవరు చెప్పారు తర్వాత ఏమైంది అని ఎన్టీఆర్ ఏమైనా చెప్పాడా లేదా మా పార్టీ వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా అంటూ ఆ మహిళా నేత యాంకర్ ను అడ్డుకుంది.

దీన్నంతా గమనిస్తే ఎన్టీఆర్ లాంటి వాక్చాతుర్యం మరియు పాపులర్ అయిన ముఖాన్ని టిడిపి తమ పార్టీలో పెట్టుకునేందుకు ఇష్టపడకపోగా వారి నేతలే అతనిపై బురద చల్లేందుకు లేదా వీలున్నప్పుడల్లా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని పూర్తిగా అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: