మోసాలు ఎన్ని రకాలుగానైనా జరగొచ్చు.  దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.  ఒక్కోసారి మనకు తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో కూడా మోసపోతుంటాం.  మోస పోవడం మన తప్పుకాదు.  మోసం చేయడం తప్పు.  ప్రతి మనిషికి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి.  అందులో సందేహం లేదు.  తెలివిగా ఎన్నో పనులు చేస్తున్నాడు.  అందులోను సందేహం లేదు.  


అయితే, ఆ తెలివిని మంచి విషయాల కోసం వినియోగిస్తే అద్భుతంగా విజయం సాధిస్తాడు.  కానీ, ఇప్పటి వ్యక్తులు మంచి విషయాలవైపు కాకుండా చెడు మార్గాల వైపు దృష్టిని పెట్టి అవకాశాలను చెడగొట్టుకుంటున్నారు.  చేతికి వచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటున్నారు.  అలా చేయడం వలన జరిగే నష్టం గురించి వాళ్లకు తెలియడం లేదు.  ఒకసారి ఒకతప్పు చేసి దొరికిపోతే ఎంతటి నష్టం వస్తుందో తెలుసుకునే సరికి జీవితం పూర్తవుతుంది.  ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.  


ఆ వ్యక్తికి రిజిస్ట్రార్ ఆఫీస్ లో రైటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.  రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చిన వాళ్లకు సంబంధించిన విషయాలు చూసుకుంటూ.. వాళ్ళ ఇచ్చిన డబ్బులకు బ్యాంకులకు వెళ్లి చలానా తీస్తూ ఉంటాడు.  ఎప్పటిలాగే అతను ఆఫీస్ కు వచ్చాడు.  ఆ వ్యక్తి దగ్గరకు  ఓ వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చాడు.  ఎప్పటిలాగే పాపం ఆ రైటర్ తన సైకిల్ మీద అతను ఇచ్చిన డబ్బు తీసుకొని బ్యాంకుకు బయలుదేరాడు.  


బ్యాంకుకు బయలుదేరిన తరువాత మధ్యలో సైకిల్ కు ఏదో చిక్కుకుంది.  తీరా చూస్తే అది దారం.  ఆ దారాన్ని బయటకు తీద్దానికి సైకిల్ స్టాండ్ వేసి కిందకు దిగాడు. అంతే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.  పక్కనుంచి వచ్చి డబ్బులున్న బ్యాగ్ ను కొట్టేసి వెళ్లిపోయారు.  దీంతో పాపం ఆ రైటర్ కేకలు వేసినా లాభం లేకపోయింది.  పట్టుకోలేకపోయారు.  వెంటనే ఆ రైటర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.  ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ సంఘటన చిత్తూరు జిల్లా కాళహస్తిలో జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: