భారత్ – పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్యం పచ్చగట్టి వేస్తేనే భగ్గుమంటోంది. పాక్ భారత్ ఎన్నిసార్లు బుద్ది చెప్పినా కుక్కతోక వంకరా అన్నట్లు తీరు మారడం లేదు. ఇతర దేశాలు కూడా చురకలంటించినా మార్పు రావడం లేదు. జమ్మూ అండ్ కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సదస్సులో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఐక్యరాజ్య సమితి లో పాకిస్తాన్ కు భారత ధీటుగా సమాధానం చెప్పింది. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును భారత్ ఎండగట్టింది. జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అమలు చేసినా అవి పూర్తిగా భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ తేల్చిచెప్పింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.

 

పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ అనంతరమే కశ్మీర్ విషయంలో మేం నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. దీనికి విస్తృత స్థాయిలో మద్దతు కూడా లభిస్తోందని చెప్పారు. ఈ సర్వసత్తాక నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమేనని, మానవ హక్కుల పేరుతో ఇలాంటి వేదికలపై రాజకీయ విష ప్రచారం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఇటువంటి వేదికలపై ప్రసంగించేవాళ్లు తమ దేశంలో మైనారిటీల పట్ల ఎంత అణచివేతకు పాల్పడుతున్నారో గుర్తెరగాలని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌లో అభివృద్ధిపరమైన విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ చెప్పారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందని తెలిపారు. తమ భూభాగం మీద ఉగ్రవాదానికి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతు ఇస్తున్న వాళ్లే అత్యంత దారుణంగా మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారన్నది స్పష్టమవుతోందనన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: