చ‌లో ఆత్మ‌కూరు....ఉత్కంఠ‌కు దారితీస్తోంది. టీడీపీ రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపురు నేప‌థ్యంలో...శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా...ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి హైఅలర్ట్ ప్రకటించారు. ఇతర జిల్లాల నుండి వస్తున్న నేతలను ఎక్కడిక్కడ అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారు. ఈక్రమంలోనే ప్రకాశం జిల్లా నేతలను నిర్బంధం చేస్తున్నారు.


కాగా, టీడీపి పిలునిచ్చిన ఛలో అత్మకూరు ను పోలీసులు అడ్డుకోవడం పై చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహారదీక్ష మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో....12 గంటల నిరాహార దీక్షకు టీడీపి శ్రేణులు సిద్ధమ‌య్యాయి. కాగా, చలో ఆత్మకూరు కార్యక్రమానికి సిద్ధమవుతున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని విజయవాడలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎనికేపాడులోని ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తుండ‌గా....పోలీసులతో వాగ్వాదం జ‌రిగింది. అనంతరం చంద్రబాబు నాయుడు నివాసానికి ఎంపీ కేశినేని నాని బయలుదేరారు.


మ‌రోవైపు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రంధశిరి గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో కిలారి శ్రీను, కిలారి సాంబయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని  సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ట్రాక్టర్, బైక్ లను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల వారిని గృహనిర్బంధం చేశారు.
కాగా, పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతిలేదన్న డీజీపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. పార్టీలు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు.  శాంతిభద్రతలు కాపాడడంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. పల్నాడు ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: