ప్రపంచంలో పర్యావరణం సమతుల్యత దెబ్బతింటున్న సంగతి తెలిసిందే.  పర్యావరణం సమతుల్యత దెబ్బ తిన్న కారణంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  అడవులు తగలబడిపోతున్నాయి.  చెట్లను నరికేస్తున్నారు.  భూకంపాలు వస్తున్నాయి.  వరదలు ముంచెత్తుతున్నాయి.  వీటన్నింటికి కారణం చెట్లను నరికివేయడమే.  


అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ చెట్లు నరికేస్తూ రోడ్లు వేయడం.. భవనాలు నిర్మించడం వలన ఈరకమైన ఇబ్బందులు వస్తున్నాయి.  ఈ ఇబ్బందుల కారణంగా ప్రపంచంలో విపత్తులు సంభవిస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. సమతుల్యత దెబ్బతినకుండా ప్రపంచాన్ని రక్షించడం మనందరి భాద్యత. దీని నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు వారి వారి ప్రయత్నం చేయాలి.  ఇలా చేయకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  


అందుకోసమే పర్యావరణ వేత్తలు దీనిపై దృష్టి సారించారు.  యూకేకు చెందిన ఓ మహిళా తన ఇంటికి సమీపంలో ఉన్న పార్క్ అంటే ఆమెకు చాలా ఇష్టం.  రోజు ఆ పార్క్ కు అక్కడి చెట్ల మధ్యన గడిపి వస్తుంటుంది.  అయితే, ఇప్పుడు ఆ పార్కును రోడ్డు డెవలప్మెంట్ పేరుతో తీసేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళా.. రోడ్డు కోసం పార్క్ ను చెట్లను నాశనం చెయ్యొద్దని వేడుకున్నది.  నిరసనలు తెలియజేసింది.  కానీ లాభాల లేదు.  


దీంతో కేట్ ఓ వినూత్నమైన ప్రచారానికి శ్రీకారం చుట్టింది.  ఆ పార్క్ లో ఉన్న ఓ చెట్టును వివాహం చేసుకుంది.  వివాహం చేసుకోవడం అంటే అలా ఇలా కాదు.  అందరి సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంది.  ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురించింది.  సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి.  మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకు ఇలా చేసారంటే.. దానికి ఆమె చెప్పిన సమాధానం.. చెట్లను నరకొద్దని, పార్కును కాపాడేందుకు అలా చేసినట్టు కేట్ పేర్కొన్నది.  మరి ప్రభుత్వం ఆ చెట్లను నరికేయకుండా ఉంటుందా.. చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: