తాను చేసిన అప్పుడు తీర్చలేక, అప్పుల వాళ్ల బాధ పడలేక ఓ వ్యక్తి చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడప్పుడు సినిమాల్లో ఇన్స్ రెన్స్ కోసం బతికి ఉన్నవారినే చనిపోయినట్లు చూపించి ఇన్స్ రెన్స్ క్లయిమ్ చేసుకోవడం..లేదా ఇన్స్ రెన్స్ కోసం చంపేయడం చూస్తుంటాం.  ఇలాంటిది నిజ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి..కేవలం ఇన్స్ రెన్స్ కోసం బతికి ఉన్నవారిని యాక్స్ డెంట్ చేయించడం..లేదా మరో రకంగా చంపేసి డబ్బులు తీసుకున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. 

తాజాగా ఓ వ్యక్తి తాను చేసిన అప్పుల వల్ల తన కుటుంబం ఇబ్బందుల పాలవకూడదని తాను చనిపోతే తన బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు వస్తుందని, ఆ సొమ్ముతో వారు సంతోషంగా ఉంటారని భావించాడు. ఇందుకోసం తాను హత్యకు గురవ్వాలని నిర్ణయించుకున్నాడు.  రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన బల్వీర్ అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు చేశాడు. అయితే, రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడం, తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో రూ. 50 లక్షలకు బీమా చేయించుకున్నాడు. ఇందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

కాకపోతే తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే ధైర్యం మాత్రం చేయలేక పోయాడు బల్వీర్. దాంతో ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి తనను హత్య చేయాల్సిందిగా బేరం మాట్లాడుకున్నాడు..అదికూడా తనకు ఏమాత్రం బాధ కలగకుండా చంపేయాలని డీల్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా రూ.80 వేలు చెల్లించాడు. సదరు వ్యక్తి డబ్బు అందగానే బల్వీర్ ని గొంతునులిమి చంపేశాడు.  అయితే ఆ చంపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆశ్చర్యపోయే సమాధానం చెప్పడంతో షాక్ తిన్నారు. భీమా కోసం తానే డబ్బులిచ్చి మరీ చంపించుకోవడం విచారణలో అసలు విషయం తెలిసి విస్తుపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: