ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన అప్పటి నుంచి, ఆయన పాలన గురించి దేశ వ్యాప్తంగా మంచి విషయాలే వినపడుతున్నాయి. 
ఎక్కడ రాజన్న రాజ్యాన్ని కాపీ చేస్తున్నట్టుగా అనిపించకుండా, తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నారు. తనకంటూ ఒక స్టైల్ నిర్మించుకుంటున్నారు. 
మరో వైపు ప్రముఖ ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకున్న టిడిపి పార్టీ మాత్రం ఇటు పాలన విషయాలను పట్టించుకోకుండా కేవలం అల్లర్లు సృష్టించడం పైనే దృష్టి పెట్టింది. తన సొంత రాజకీయ ఉనికిని కోల్పోకుండా ఉండటానికి ఏ మార్గము కనిపించకపోయే సరికి, ఇక రాష్ట్రంలో భయాందోళనలు రెచ్చగొట్టడంలోనే తన రాజకీయ భవిష్యత్తుకు భద్రత ఉంది అని నిర్ధారించుకున్న చంద్రబాబు నాయుడు, ఈ రోజు అదే పనిపై పల్నాడులో నడుంబిగించారు.


2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ని గౌరవిస్తూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇదే. కానీ, అటు కేంద్రంలోని బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలతో శత్రుత్వాన్ని పెంచుకుని, ఇటు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తోను శత్రుత్వాన్ని పెంచుకుంటూ, ఏ విధంగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరు అనుకుంటున్నారు అన్న విషయం వారికే తెలియాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో గ్రామాలు నగరాలు వరదతో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ చంద్రబాబు నాయుడు అక్కడ కనిపించిన దాఖలాలు లేవు. మరి ఏ విధంగా మళ్లీ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలరు అని అనుకుంటున్నారు?


గుంటూరు నే కేంద్రంగా చేసుకుని అక్కడ జాతి వివక్షను పెంచి పోషించే విధంగా రాజకీయాలను ఇన్నాళ్లు నడుపుకుంటూ వచ్చారు. ఇక ఆ ఫార్ములా కూడా ఫలించక పోయేసరికి, మంచిచెడు అనే వివేకాన్ని కూడా విస్మరించి రోడ్డుమీద అల్లర్లు సృష్టించే స్థితికి దిగజారిపోతున్న చంద్రబాబు నాయుడు ని ఏపీ ప్రజలు క్షమించరు. ఇప్పటికే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో వాణిజ్యం పెంచాల్సిన సమయంలో, ఈరోజు పల్నాడు లో జరగబోతున్న రక్కసుని అదుపుచేయడానికి 144 సెక్షన్ ను సైతం అమలులోకి తీసుకు వచ్చే పరిస్థితి ని సృష్టించారు నాయుడు!



మరింత సమాచారం తెలుసుకోండి: