ఇదేంటండి పాలధర మా అంటే లీటర్‌కు 40 నుండి 50 వరకు వుంటుంది కాని మీరు నూట నలబై రూపాయలంటున్నారని ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే.అక్కడ పాలధర చుక్కలను తాకుతుంది.దాన్ని ప్రశ్నించేవారు లేరని,ఇంకా మొహర్రం పండగ వస్తుందని పాలధరను అమాంతం పెంచేసారు వ్యాపారులు.అవసరం వినియోగ దారులది కాబట్తి కిమ్మనకుండా ఆ రేటుకైన కొన్నారు.ఇదంతా ఎందుకోసమంటే ఉచితంగా పంచడం కోసం.మళ్లీ ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే ఇంతకు ఎక్కడో ఈ సంఘటన జరిగింది తెలుసుకుందాం..



మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయట,ఇక పాకిస్థాన్‌లో పెట్రోల్‌ ధర కన్నా మించి పాల ధరలు పెరిగి పోవడం గమనార్హం.కరాచీ, సింధు ప్రావిన్స్‌ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ.140 వరకు వసూలు చేయగా,అదే రెండ్రోజుల కిందట పాక్‌లో లీటరు పెట్రోల్‌కు రూ.113,లీటరు డీజిల్‌కు రూ.91 ధర ఉంది.వీటికి పోటీగా సింధ్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో లీటరు పాలకు రూ.140 వరకు ధర పలికింది. పాలకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడటంతో కరాచీలో రూ.120 నుంచి 140కి లీటరు పాలు అమ్మినట్టు ఒక దుకాణదారుడు వెల్లడించినట్టు పాక్‌ మీడియా తెలిపింది.



మరి అక్కడి జనం పాలకు ఇంతగా రేటు ఎందుకు పెడుతున్నారంటే,మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి స్టాల్స్‌ ఏర్పాటుచేసి,ఉచితంగా పాలు, పళ్లరసాలు,తాగునీరు అందిస్తారట,ఇలా సబీల్స్‌ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్‌ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి.పాల ధర నియంత్రణకు కరాచీ కమిషనర్‌ ఇఫ్తీకార్‌ షాల్వానీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా,ధరలు ఆకాశాన్నంటినా ఆయన పట్టించుకోలేదని పలు పాక్‌ పత్రికలు పేర్కొన్నాయి.ఇక, కమిషనర్‌ కార్యాలయంలోనే లీటరు పాలను రూ.94లకు అమ్మడం గమనార్హం..ఏది ఏమైన ఎంత పండగొచ్చిన పాల ధరను అమాతం పెంచడంతో అక్కడి మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: