పాలనాడులో సంగ్రామం మొదలైంది.  ఇప్పుడు సంగ్రామం ఏంటని అనుకునేరు.. ఎన్నికలు పూర్తయ్యి వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పలనాడులో ఆధిపత్య పోరు మొదలైంది.  ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైకాపాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పాలనాడులో యుద్ధం జరగబోతున్నది.  తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం రసాభాసగా మారింది.  


తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.  ఎవరిని బయటకు రానివ్వడం లేదు.  ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లను హౌస్ అరెస్ట్ చేశారు.  దీంతో చంద్రబాబు ఆత్మకూరు బాధితుల కోసం తన ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగారు.  రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధం అయ్యారు.  అటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  


ఇదిలా ఉంటె, చలో ఆత్మకూరు విషయం గురించి వైకాపా అధినేత వైఎస్ జగన్ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది.  మాములుగా ఉదయం నుంచి రోజువారీ కార్యక్రమంలో బిజీ అయ్యారు.  ఈరోజు బుధవారం కావడంతో మంత్రివర్గ మీటింగ్ జరిగింది.  ఉదయం 10:30 గంటల నుంచి మంత్రులతో మాట్లాడారు.  సమీక్షలు నిర్వహించించారు.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు వైఎస్ ఈ మధ్యాహ్నం జరిగే స్పందన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  రోజు వారి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు.  చలో ఆత్మకూరు విషయంపై స్పందించకపోవడం విశేషం.  వైకాపా పార్టీ నాయకులు ఈ చలో ఆత్మకూరుపై స్పందిస్తుండటంతో జగన్ దాన్ని గురించి పట్టించుకోలేదు.  అవసరం లేని విషయాల జోలికి వెళ్లి సమయం వృధా చేయడం ఇష్టం లేదని గతంలో జగన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.  ఈరోజు పనులు ముగించిన తరువాత ఈ విషయంపై సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: