గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు.కాగా టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఈ విషయం తెలిసిన అచ్చెన్నాయుడు,చంద్రబాబు నివాసానికి వెళుతున్న సమయంలో పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు, దీంతో అచ్చెన్నాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ,ఎస్పీ విక్రాంత్ పటేల్ ను యూజ్ లెస్ ఫెలో అంటూ దూషించారు.పల్నాడులో ఉద్రిక్త పరిస్థితి రీత్యా 144 సెక్షన్ అమలులో ఉన్నందున లోపలికి ఎవ్వరినీ అనుమతించటంలేదనీ..అందుకే అడ్డుకోవాల్సి వచ్చిందనీ ఎస్పీ విక్రాంత్ పటేల్ అచ్చెన్నాయుడికి సర్థిచెప్పే యత్నంచేశారు.



అయినా ఊరుకోని అచ్చెన్నాయుడ..మరింతగా రెచ్చిపోతూ,ఏయ్ఎ,క్స్ ట్రాలు చేయొద్దు..నన్ను ఆపే అధికారం మీకెవరిచ్చా రంటూ పోలీసులు ఆపినా ఆగకుండా ముందుకు వెళ్ళి, అచ్చెన్నాయుడు పోలీసులపై చిందులేశారు.అంతే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ..విరుచుకుపడ్డారు.ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు.పోలీసులు ఎంతగా సర్దిచెప్పిన వినకుండా తన ప్రతాపాన్నికొనసాగించాడు.నేను చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లుతున్నా..శాంతియుతంగా ఉన్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశా,మంత్రిగా కూడా పనిచేశాను మీరు చిన్నవిషయాన్ని కూడా పెద్దది చేస్తున్నారు.ఇది సరైంది కాదు మీరు లోపలికి పంపేవరకు ఇక్కడే కూర్చుంటాం ముందుకు వెళ్లం అని చెప్పినా ఎస్పీ మాత్రం ఇక్కడ కూడా కూర్చునేందుకు వీల్లేదన్నారు.అయినా వారు అక్కడి నుంచి వెళ్లకపోవటంతో అచ్చెన్నాయుడితో పాటు నన్నపనేని రాజకుమారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 





ఇక మాజీ సీఎం చంద్రబాబుని కూడా ఆత్మకూరు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు అమరావతిలోని ఆయన నివాసం లోనే హౌస్ అరెస్ట్ చేశారు.ఇక ఇక్కడ జరుగుతున్న గొడవలతో సామాన్యులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఆధార్‌,ఇతర గుర్తింపు కార్డులను చూపించనిదే గ్రామంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు.చివరికి ఆత్మకూరులో రైతులను కూడా పోలీసులు పొలాలకు కూడా వెళ్లనివ్వక పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అంతేకాకుండా ఆత్మకూరు నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించి,శుభకార్యానికి వచ్చిన బంధువులను సైతం పోలీసులు వెనక్కి తిప్పి పంపించి వేస్తున్నారు..ఇక టీడీపీ చలో ఆత్మకూరు పిలుపు మేరకు పోలీసులు పలు ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ , ఇంతగా అల్లర్లు సృష్టిస్తున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: