ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గం టిడిపిలో అయోమయం నెలకొంది. నియోజక వర్గ ఇంచార్జి లేకపోవడంతో, కార్యకర్తలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రెండు వేల పద్నాలుగులో దర్శి నుంచి ఎమ్మెల్యేగా సిద్ధా రాఘవరావు గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రయ్యారు. నియోజక వర్గాన్ని భాగానే డెవలప్ చేశారు, అనుకోని రాజకీయ కారణాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మద్ది శెట్టి వేణు గోపాల్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నుంచి కదిరి బాబురావు అసంతృత్తితో ఉన్నారు.


పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు, రెండు వేల పద్నాలుగులో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబురావు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే సీటు ఆశించారు. అయితే అనూహ్య పరిణామాలతో అయిష్టంగానే దర్శించి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేయాలని భావించినా అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు అనుకోని విధంగా ఒంగోలు టిడిపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి రావడంతో కదిరి బాబూరావుకు దర్శి నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఓడిపోతారని ముందుగానే భయపడిన కదిరికి అనుకున్నట్టుగానే ఓటమి స్వాగతం పలికింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కదిరి బాబురావు ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నిరసన కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో తనకు మళ్లీ దర్శి నుంచి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. అందుకోసమే నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయి. అటు కదిరి టికెట్ పై కూడా అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు.


దీంతో ఆయన ఏ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు దీంతో దర్శి టిడిపి పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. ఈ పరిస్థితుల్లో దర్శి టిడిపి క్యాడర్ లో అయోమయం గందరగోళం నెలకొన్నది. గతంలో ఇక్కడ నుంచి ప్రాతి నిధ్యం వహించిన శిద్దా రాఘవరావునే తిరిగి బాధ్యతలు చేపట్టాలని కేడర్ కోరుతోంది. చంద్రబాబు ఆదేశిస్తేనే తిరిగి తను దర్శిలో చురుగ్గా పాల్గొంటానని క్యాడర్ దగ్గర శిద్దా చెప్తున్నారట. తన మనసంతా దర్శిలోనే ఉందని అయితే దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు విషయం తేల్చితేనే తాను స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: