కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారా, రాజకీయంగా ఎటు అడుగు వేయాలో తెలియక అసెంబ్లీలో ఒంటరైపోయారా, తెలంగాణలో నెక్ట్ బిజెపినే అంటున్న రాజగోపాల్ రెడ్డి మరెందుకు బిజెపిలో చేరటం లేదు. ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు, మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. మొదట్లో సీఎల్పీ లీడరు అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పదవిని అందుకోలేక పోయారు.


అయితే అప్పటి నుండి ఆయన ఓ కొత్త స్వరం ఎత్తుకున్నారు. ఇక కాంగ్రెస్ పని తెలంగాణలో అయిపోయింది ఇక ఇక్కడ బిజెపి హవా నడుస్తుందని మొదలు పెట్టారు. బిజెపిలో చేరేందుకు కూడా సిద్ధపడ్డారు కానీ, ఎందుకో ఆయన చేరిక ఆగిపోయింది. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఎవరు అడ్డు పడ్డారు అనేది ఓ చర్చ నడిచింది. అయితే, ఎమ్మెల్యే పదవి వల్లనే ఆయన చేరిక ఆగిందని ఊహాగానాలు వినిపించాయి. ఎమ్మెల్యేగా బిజెపి లో చేరితే ఆయన పదవికి ఇబ్బంది అని భావించి అటు చేరకుండా ఇటు కాంగ్రెస్ తో కలిసి పని చేయకుండా అసెంబ్లీలో ఒంటరిగా తిరుగుతున్నారు రాజగోపాల్ రెడ్డి.


ఓ పక్క అన్న కాంగ్రెస్ ఎంపీగా గెలవడం కూడా రాజగోపాల్ కు మరింత ఇబ్బందిగా మారింది. అన్నను పక్కన పెట్టి వెళ్లిపోదామనుకుంటున్న కాంగ్రెస్ నేతలు సస్పెండ్ కూడా చేయట్లేదు. కోమటిరెడ్డి బిజెపి లో చేరాలంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ముగ్గురు సభ్యులు వస్తే టూ థర్డ్ రూల్ కింద బిజెపిలో విలీనం కావచ్చు. కానీ కాంగ్రెస్ లో ఇప్పుడున్న ముగ్గురు సభ్యులు ఆయనతో రావటానికి సిద్ధంగా లేరు. దీంతో ఏం చేయాలో తోచని కోమటిరెడ్డి ఒంటరిగా అసెంబ్లీలో గడుపుతున్నారు. కన్ఫ్యూజన్ లో రకరకాల కామెంట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: