ఈ సమాజంలో వున్న మనషులకు తోటి మనషుల వల్లనే రక్షణ లేకుండా పోతుంది.అందుకు నిదర్శనమే  టీడీపీ నాయకులు చేసిన పని,ఇంతకు ఏం జరిగిందంటే.  మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామానికి చెందిన గ్రామ వలంటీర్‌ కిమిడి గౌరునాయుడు విధుల్లో భాగంగా మంగళవారం రేషన్‌ సరుకులు తీసుకున్న,ప్రతి లబ్ధిదారుని వేలిముద్రను తీసుకొని బియ్యానికి సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు.ఇంతలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు దూబ ధర్మారావు సోదరుడు దూబ అప్పల నాయుడుతో పాటు,దూబ పాపారావు,కిమిడి నీలకంఠం,కిమిడి రమేష్,దూబ సూరపునాయుడులు వచ్చి దుర్భాషలాడుతూ దాడికిపాల్పడ్డారని గౌరునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



ఇక గాయపడిన గౌరునాయుడును కుటుంబ సభ్యులు బైక్‌పై రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అతన్ని పరిశీలించిన వైద్యులు అతనికి,మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.రేవతి,ఏఎస్‌ఐ వి.శ్రీనివాసరావు,సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడు వద్ద నుంచి వివరాలను సేకరించిన,అనంతరం,ఈ ఘటనకు సంబంధించి గౌరునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దాడి జరిగిన విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గౌరునాయుడును పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,టంకాల అచ్చెన్నాయుడు,వావిలపల్లి జగన్మోహనరావు,మజ్జి శ్రీనివాసరావు,టంకాల ఉమాపాపినాయుడు తదితరులు ఉన్నారు.అతనికి ధైర్యం చెబుతూ,నీ వెంట తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు.



ఇక ఈ విషయం పై ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరా తీశారు.గౌరునాయుడుపై దాడి హేయమైన చర్యని,దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు..ఈ సంఘటనపై భాదితుడు మాట్లాడుతూ,తనపై అకారణంగా దాడి జరిగిందని,తనను దూషిస్తూ తనపై దాడిచేసారని,తన విధుల్లో భాగంగానే  ప్రతి ఇంటికి
వెళ్లి వేలిముద్రలను తీసుకోవడంలో తన తప్పేమీలేదని, వారు ప్రతి ఇంటికి వెళ్లి వేలిముద్రలు ఎందుకు తీసుకుంటున్నావంటూ,తనపై దాడి చేశారన్నారు..ఈ విషయం తెలుసుకున్న గౌరునాయుడు కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని నిలువరించే ప్రయత్నం చేయగా వారిని కూడా దుర్భాషలాడుతూ అంతుచూస్తామని బెదింపులకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: