ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి  జగన్  ఇటీవల  100 రోజులు పూర్తి చేసుకున్నాడు.  ఈ సందర్భంగా  జగన్ సొంత మీడియా..  సాక్షి  ఆయన తో ఇంటర్వ్యూ  చేయాలనుకుంది. కానీ  ఆ ముఖాముఖి ఫై  జగన్ అంతగా ఆసక్తి చూపలేదట.  ఏకంగా ఏడాది పాలనా తర్వాతే  ముఖాముఖీ లో  పాల్గొంటే బాగుంటుందని జగన్ భావిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే  ప్రజలనుండి  100 రోజుల జగన్  పాలన ఫై సానుకుల స్పందన వచ్చింది. 


అయితే   ఓవర్గం మీడియా  మాత్రం  జగన్  ప్రవేశిన పెట్టిన పథకాల ఫై దృష్ప్రచారం  చేసి  ప్రజల్లో  వ్యతికేరత వుందని  కథనాలు వెలువరిచింది. ఆంధ్రప్రదేశ్ లో సొంత మీడియా సాక్షి తప్ప మెజారిటీ  మీడియా జగన్ కు వ్యతిరేకమే అనే సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు.  జగన్ మీద అక్కసు వెల్లగక్కే మీడియా సంస్థలే అక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాంతో జగన్ పాలన ఫై  ప్రజలు అసంతృప్తిగా  వున్నారంటూ కొన్ని చానెళ్ళు రక రకాల వార్తలను  ప్రచారం చేస్తున్నాయి.  కాగా  జగన్ ఇప్పుడు మీడియా ఫై  ద్రుష్టి పెట్టాడట.  ఏఏ ఛానెళ్లు  ప్రభుత్వంఫై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయో వాటి  వివరాలను తెలుసుకుంటున్నారట.  ఈవిషయం ఫై సమీక్ష నిర్వహించడానికి కూడా జగన్ సిద్దమవుతున్నట్లు సమాచారం.     



కాగా   జగన్ 100 రోజుల  పాలన ఫై అయనతో ముఖాముఖీ ని నిర్వహించడానికి  పలు చానెళ్లు  ఆసక్తి కనబస్తున్నాయట. అందులో భాగంగా ఎన్ టీవీ ,హెచ్ ఏం టివి , ఏపీ 24 x 7 ఛానెళ్ల అధినేతలు  జగన్ అపాయింట్ మెంట్ కోసం సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట. ఈ నేపథ్యంలో  వీరికి  అపాయింట్ మెంట్ ఇవ్వకుండా  జగన్ షాక్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: