70 ఏళ్ళు అంటే 1947 నుండి ఒక దేశంగా మనకు ఎన్నో విజయాలు ఉన్నాయి. మనం వ్యాపారాలు నిర్మించుకున్నాం, మన శాస్త్రవేత్తలు నమ్మశక్యం కాని ఎన్నో గొప్ప పనులు కూడా చేశారు. కానీ స్వాతంత్ర భారతదేశంలో అతి గొప్ప విజయం ఏంటి అంటే మన రైతు చాలా పరిమిత మౌళిక సదుపాయాలతో ఎటువంటి గొప్ప ఆధునిక విజ్ఞాన శాస్త్రం సహాయం లేకుండా సాంప్రదాయ రీతిలో 125 కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. కాని అటువంటి వారిని మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాము. గత 10, 12 సంవత్సరాలలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.


ఆహారాన్ని అందిస్తున్నారు. కాని అటువంటి వారిని మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాము. గత 10, 12 సంవత్సరాలలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.రైతులు బాధపడటానికి ఉన్న అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి మన నీటి వనరులు హీనస్థితికి క్షీణించిపోవడం, అలాగే మన భూమి ఉన్న దుస్థితి మన నేల 70 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే ఎంతో ఘోరంగా క్షీణించిపోయింది .70 ఏళ్ల క్రితం మన నీటి వనరులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూస్తే తీవ్రంగా క్షీణించిపోయాయి. మన నదులు సగటున 40 శాతం క్షీణించుకుపోతున్నాయి. మన భూగర్భజలాలు గణనీయంగా క్షీణించాయి. 72 సంవత్సరాల క్రితం 1947 లో ఉన్న తలసరి నీటి పరిమాణం నుండి ఇవాళ కేవలం 21 శాతం మాత్రమే ఉంది. అంటే 72 సంవత్సరాల తర్వాత మళ్లీ మనం భారత దేశాన్ని తీవ్రమైన నేల ఇంకా నీటి క్షీణతనుండి విముక్తి కలిగించాలి.

మనకు వర్షం వస్తేనే నీరు ఉంటుంది కాబట్టి ఆ 60 రోజుల్లో వచ్చే నీటిని మనం ఈ నేలలో 365 రోజులకు సరిపడేలా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవడానికి గల ఒకే ఒక్క మార్గం అవసరమైన వృక్ష సంపద. కాబట్టి చెట్లను పెంచడం ఒకటే మార్గం. అడవులను పెంపొందించడం అనేది జరగనిపని, ఎందుకంటే జనాభా ఒత్తిడి చాలా ఎక్కువ కాబట్టి మనం వెళ్లగలిగేది అగ్రోఫారెస్ట్రీ, హార్టికల్చర్ వృక్షాధారిత వ్యవసాయ మార్గంలో మాత్రమే. ఒక రైతు అగ్రోఫారెస్ట్రీకి మారితే 5 నుండి 7 సంవత్సరాలలో అతడి ఆదాయం 300 నుండి 800 శాతం వరకూ పెరుగుతుంది. తమిళనాడులో 69,670 రైతులు  అగ్రోఫారెస్ట్రీ దిశగా మారారు. ప్రతి సంవత్సరం 2000 నుండి 3000 మంది రైతులను ఆగ్రోఫారెస్టి వైపుకి మారుతున్నారు.


ఇలా వెళితే ఇంకొక 80 నుండి 100 సంవత్సరాలు పడుతుంది, అప్పటి వరకు చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే 100 సంవత్సరాలని 12 సంవత్సరాలలో ఎలా కుదించాలా చూద్దాం. కాబట్టి దీనిలో భాగంగా ఒక ఉద్యమాన్ని నిర్వహించి  ప్రజలు చెట్లను నాటడానికి సహాయపడి మన దేశాన్ని నీటి సంక్షోభం నుండి విముక్తి చేయడమంటే ఇదే. భారత దేశం యొక్క భూభాగంలో కనీసం మూడింటి ఒక్కటి పచ్చదనంతో ఉండేట్లు చేయడం, ఇలా చేస్తే భూగర్భజలాలు తిరిగి నిండుతాయి. దీని ఆధారంగా వచ్చే 12 సంవత్సరాలలో 242 కోట్ల చెట్లను కావేరీ పరివాహక ప్రాంతాల్లో ఎలా నాటాలో, అలా కావేరీ పరివాహక ప్రాంతాల్లో నీటి పరిమాణం 9 లక్షల కోట్ల లీటర్లకు చేరుకోవాలని ఇది ప్రస్తుతం ఉన్న కావేరి నదిలో 45 శాతం.


భారత దేశానికి విముక్తి నివ్వడమంటే కేవలం కావేరీ నది గురించే కాదు భారత దేశాన్ని మట్టి, నీటి సంక్షోభం నుండి విడిపించడం అంటే ఇది మనుషుల జనాభాలో పావు వంతు. ఒకవేళ ఇంతమంది విపరీతమైన భూమి,నీటి కొరతతో ఉంటే ఏం జరుగుతుంది అనేది మొత్తం మానవాళి యొక్క మనస్సాక్షి పైనే ఆధారపడి ఉంది. భారత దేశాన్ని నీటి కొరత నుండి నడిపించాల్సిన సమయం వచ్చేసింది, ఈ దేశాన్ని నీటి సంక్షోభం నుండి విముక్తి చేయడం మనకు అవసరమైన స్వాతంత్య్ర ఉద్యమం. మనకి భూమి ఉంది కానీ మనం మన ఆహారాన్ని పెంచుకోలేకపోతే తాగడానికి నీరు లేకపోతే ఈ స్వేచ్ఛతో మనం ఏం చేసుకోవాలి అని సద్గురూ వివరించారు.








మరింత సమాచారం తెలుసుకోండి: