కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 వ తేదీ నుండి కొత్త మోటారు వాహనాల చట్టం - 2019 అమలులోకి తెచ్చింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత నిబంధనలు పాటించని వాహనదారులకు భారీ స్థాయిలో జరిమానాలు పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ జరిమానాలు వాహనం కొనుగోలు చేసిన రేటు కంటే ఎక్కువగా ఉండటం విశేషం. కొందరు భారీ జరిమానాలను కట్టలేక వాహనాలను అక్కడే వదిలి వెళుతుంటే మరికొందరు వాహనాలని కాల్చేసిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. 
 
మరి మన దేశంలో మాత్రమే ఇంత భారీ స్థాయిలో జరిమానాలు ఉన్నాయా ? ఇతర దేశాల్లో జరిమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే ప్రశ్నకు వేరే దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి కోసం భారీ జరిమానాలు ఎప్పటినుండో అమలులో ఉన్నాయని తెలుస్తోంది. దుబాయి, రష్యా, అమెరికా, బ్రిటన్, సింగపూర్ లో ఎప్పటినుండో భారీ జరిమానాలు విధించటం జరుగుతోంది. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇండియన్ కరెన్సీలో 72 వేల రుపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 
 
సీటు బెల్టు పెట్టుకోకపోతే మాత్రం 1800 రుపాయలు జరిమానా విధిస్తారు. దుబాయిలో వాహనం మురికిగా ఉన్నా కూడా జరిమానా విధిస్తారు. వాహనం పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మురికిగా కనిపిస్తే ఆ వాహనానికి పది వేల రుపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాత వాహనం యజమానికి ఈ విషయం గురించి తెలియజేయటం జరుగుతుంది. వాహన యజమాని ఒకవేళ సరిగా స్పందించకపోతే 15 రోజుల వ్యవధిలో వాహనాన్ని స్క్రాప్ యార్డుకు తరలిస్తారని తెలుస్తోంది. 
 
రష్యాలో మద్యం తాగి వాహనం నడిపితే ఆ వాహనదారుడి లైసెన్స్ మూడు సంవత్సరాల పాటు రద్దు చేసి ఇండియన్ కరెన్సీలో 54,000 రుపాయలు జరిమానా విధిస్తారని సమాచారం. సింగపూర్ లో వాహనం నడిపే సమయంలో ఫోను మాట్లాడుతూ పట్టుబడితే ఇండియన్ కరెన్సీలో 73,000 రుపాయలు జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు. మద్యం తాగి వాహనం నడిపితే 3,60,000 రుపాయలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: