చంద్రబాబుకు ఓ ముద్దు పేరు ఉంది. మీడియా బేబీ అని. దాన్ని పెట్టిన వారు ఎవరో కాదు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన బాబు కంటే రాజకీయాల్లో తలపండిన సీనియర్ 1989లోనే ఆయన బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. పైగా పక్కా మాస్ లీడర్. జనంలో విపరీతమైన ఫాలయింగ్ అప్పట్లో ఉండేది. మరి బాబు 1995లో సీఎం అయ్యాక జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుతున్నట్లుగా  బిల్డప్ ఇస్తున్న టైంలో లాలూ బాబు వైఖరి పట్ల విసుక్కునేవారు. మీడియాని మేనేజ్ చేస్తూ బాబు చేస్తున్న ట్రిక్కులకు ఆయన పెట్టిన పేరే మీడియా బేబీ అని. 


అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబుకు మీడియా మేనేజ్మెంట్ వెన్నతో పెట్టిన విద్య. అది ఈ రోజు మరోమారు బయటపడింది. పక్కా ప్లాన్ తో బాబు గత రెండు రోజులుగా జాతీయ మీడియాను వెంటబెట్టుకుని మరీ కవేరేజికి రెడీ చేయించారు. చలో ఆత్మకూర్ అదిరిపోవాలని బాబు అనుకున్న ప్లాన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది. బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తే అక్కడే ఉన్న జాతీయ మీడియా దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి నేషనల్ మీడియాలో చూపించింది అంటే బాబు మార్క్ అంటే అదీ అనిపించింది.


ఢిల్లీ, హైదరాబాద్ జర్న‌లిస్టులను బస్సులు, ఫ్లైట్లు పెట్టి మరీ టీడీపీ చలో ఆత్మకూర్ ర్యాలీకి తీసుకువచ్చినట్లుగా సమాచారం, బాబు ఇల్లు ఉండవల్లి, ఆత్మకూర్, అరండల్ పేటలో ఉన్న  పునరావాస శిబిరాల వద్ద మీడియా మొత్తాన్ని మోహిరించి తనకు అనుకూలంగా కవరేజి ఇప్పించుకోవడంతో బాబు సక్సెస్ అయ్యారు. దాంతో ఈ రోజు బాబు హౌస్ అరెస్ట్ కూడా నేషనల్ న్యూస్ అయి కూర్చుంది. ఏపీలో జగన్ పాలనలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని గోల గోలగా జాతీయ వార్తల్లో ప్రసారం అయింది. రాజకీయ బాధితుల శిబిరాలు కొత్త కాన్సెప్ట్ అంటూ ఏపీలో అరాచక పాలన అంటూ కూడా బాబు అనుకూల మీడియా తెగ ప్రచారం చేసింది.



ఓ విధంగా మూడు నెలల వైసీపీ పాలనపై యాంటీ మీడియా కవరేజ్ ఇప్పించుకోవడంలో టీడీపీ, చంద్రబాబు పూర్తి విజయం సాధించారు.  మరో వైపు వైసీపీకి మీడియా మేనేజ్మెంట్  లేక ప్రభుత్వ వాయిస్ ఎక్కడా బయటకు పోలేదు. మొత్తానికి ఈ రోజు జరిగిన చలో ఆత్మకూర్ ఎపిసోడ్ ఓ విధంగా జగన్ కి, వైసీపీకి కనువిప్పేనని అంటున్నారు. లేని దాన్ని స్రుష్టించి గాలిని సైతం పోగు చేసి గందరగోళం స్రుష్టించగల టీడీపీ పక్కనే ఉందని జగన్ గుర్తుంచుకుని మీడియా మేనేజ్మెంట్ నేర్చుకోవాలని సూచిస్తోంది ఈ ఎపిసోడ్ అంటున్నారు వైసీపీ జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: