తెలంగాణ అంతటా..ముఖ్యంగా హైదరాబాద్ లో డెంగీతోపాటు పలు జ్వరాలు విభృభించి కొంత మంది మృత్యువాత కూడా పడ్డారు. ఏకంగా తెలంగాణ హైకోర్టు కూడా హైదరాబాద్ లో దోమల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా  తీసుకున్న చర్యలు ఏంటో తమకు తెలియజేయాలని సర్కారును ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ ట్వీట్  చేస్తూ జ్వరాల బారిన పడకుండా..ముఖ్యంగా డెంగీ రాకుండా ఉండాలంటే నీటి తొట్టెలు, పూలకుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. తన ఇంట్లో ఆ పని తానే చేశానని కూడా కెటీఆర్ తెలిపారు. 


ప్రతి వర్షాకాలంలో సీజన్ లోనూ ముఖ్యంగా నగరంలో డెంగీ, ఇతర వైరల్ ఫీవర్లు ప్రజలపై దాడి చేయటం కామన్. అంటే ఆరేళ్ల పాటు జ్వరాల ప్లానింగ్ కూడా చేయలేరా?. వైరల్ ఫీవర్లపై ఓవైపు మీడియా, హైకోర్టు స్పందించినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ శాఖపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. మీడియా ఓ వైపు, విపక్షాల విమర్శల జోరు పెరిగాక మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం సమీక్షలు..ఆస్పత్రులను సందర్శించారు. 



దీనికి మహేష్ బాబు స్పందిస్తూ కెటీఆర్ కు మద్దతుగా ఆయన ఓ  ట్వీట్ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి..నీరు నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండటంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి హైదరాబాద్ ప్రజలారా’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ప్పుడూ స్పందించని హీరో మహేష్ బాబు కెటీఆర్ ట్వీట్ చేయగానే స్పందించటం పట్ల సోషల్ మీడియాలో భిన్న కధనాలు వైరల్ అవుతున్నాయి. కాగా  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెటీఆర్ జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశం పెట్టి ఇక నుంచి సీజనల్ వ్యాధుల క్యాలెండర్ సిద్ధం చేసి..దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: