ప్రతిపక్ష హోదాలో ఉన్న బాబు హుందాగా వ్యవహరించకుండా హింసను పెంచే విధంగా ప్రవర్తించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. పోలీసులు వచ్చి బాధితులను తమ స్వంత గ్రామాలకు తరలించారు. ఇంతటితో ఇక్కడ సమస్య ముగిసిపోయింది. కానీ బాబు ఇంకా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారితప్పితే అప్పుడు చంద్రబాబుకు హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గాని పవన్ కళ్యాణ్ గాని ఉద్యమాలు చేస్తే వీరు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని బాబు గారు చాలా ఆవేదన చెందారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏందీ ? కార్యకర్తల మీద దౌర్జన్యాలు అంటూ .. రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నారు.


అమరావతి తరలిపోతుందని .. ఉన్నది లేనిది చెబుతూ రాష్ట్రంలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరీ చంద్రబాబు చర్యల వల్ల ఇప్పుడు పెట్టుబడులు ఆగిపోవా ? అంటే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది కేవలం తన రాజకీయ లబ్ది కోసమేనని అర్ధం చేసుకోవాలి. పైకి మాత్రం ప్రజలు అంటూ బిల్డప్ ఇస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలానే .. టీడీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోతున్నాయని పబ్లిసిటీ రాజకీయాలు చేశారు. కానీ అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీషురూ చేశారు. కామెడీ ఏంటంటే ఇప్పుడు కూడా జనాలు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. కానీ బాబు మాత్రం .. పొలిటిల్ మైలేజ్ కోసం తెగ పాకులాడుతున్నారు.


చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజల్లో నమ్మకం ఎప్పుడో పోయింది. ఇప్పుడు చలో ఆత్మకూరు పేరిట బాబు చేస్తున్న డ్రామాలు ప్రజలకు చిరాకు పుట్టిస్తున్నాయి. 100 రోజులు జగన్ తన పాలనను పూర్తి చేసుకున్నారు. అదే మాదిరిగా 100 రోజులు చంద్రబాబు ప్రతి పక్షంలో  పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజులు జగన్ ..చంద్రబాబుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేసి ఇంకా దిగజారిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: