రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. అప్పటివరకు ఉప్పు-నిప్పుగా ఉండే పార్టీలు ఇట్టే కలిసిపోతాయి...పొత్తులు పెట్టేసుకుంటాయి. అందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉదాహరణలు చూశాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవకాశాన్ని బట్టి ఇతర పార్టీలతో సఖ్యతగా మెలుగుతారు. చివరికి ఎన్నో ఏళ్ళు శత్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా కలిశారు.  అయితే ఏపీలో చంద్రబాబు పార్ట్నర్ గా పేరు తెచ్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.


పార్టీ పెట్టిన వెంటనే బీజేపీ-టీడీపీతో కలిసి వెళ్లిన పవన్..తాజాగా కొత్త పొత్తు కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ పార్టీతో. ఇటీవల పవన్ ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు కలిసిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేసే పోరాటానికి మద్దతు పలకాలని వీహెచ్ పవన్‌కు కోరారు. ఇక వి‌హెచ్ కోరికని కాదనని పవన్.. యురేనియం తవ్వకాలపై గళం ఉమ్మడి పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.


ఆ వెంటనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యురేనియం తవ్వకాలపై ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో పవన్ కల్యాణ్ కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామాలని చూస్తుంటే పవన్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో జనసేన ఏ రేంజ్ లో ఓటమి పాలైందో అందరికీ తెలుసు. అలాగే ఆ పార్టీ టీడీపీ-వైసీపీలకు దూరంగా ఉంటూ రాజకీయం చేస్తోంది. అయితే ఏపీలో ఎలాగో తన సత్తా ఎంతో తెలుసుకున్న పవన్ తెలంగాణలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో సమస్యలపై పోరాడటానికి కాంగ్రెస్ తో కలిసి పయనించేందుకు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


కానీ ఈ ప్రచారాన్ని జనసేన నేతలు ఖండిస్తున్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉమ్మడి పోరుకు మాత్రమే పవన్ మద్దతు ఇచ్చారని అంటున్నారు. అంతేకానీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయరని చెబుతున్నారు. అయితే ప్రజారాజ్యం సమయంలో గానీ, రాష్ట్ర విభజన సమయంలో పవన్ కాంగ్రెస్ పార్టీని, నేతలపై ఏ రేంజ్ లో విమర్శలు చేశారో అందరికీ తెలుసు. అలా విమర్శలు చేసిన పార్టీతోనే పవన్ ఇప్పుడు కలిసి ముందుకు వెళుతున్నారు. పవన్ కాంగ్రెస్ తో స్నేహం యురేనియం తవ్వకాల వరకే ఉంటుందా..లేక  భవిష్యత్ లో కూడా కొనసాగుతుందా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: