జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 100 రోజులనే తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబునాయుడు. జగన్ పాలన ఇలాగే ఉంటే ఇక ఐదేళ్ళు ఎలా తట్టుకుంటారో ? అన్నట్లుగా తయారైంది టిడిపి పరిస్ధితి. 2014 లో ఏవో మాయమాటలు చెప్పి, రైతులతో పాటు అనేక వర్గాలను మభ్యపెట్టి ఓట్లేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తనను నమ్మి ఓట్లేసిన జనాలకు చుక్కలు చూపారు.

 

ఏవోవే కథలు చెప్పి ఐదేళ్ళు కాలం గడిపేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఏదోరకంగా మాయచేసి గెలిచిపోవచ్చని అనుకున్నారు. చంద్రబాబు ఆలోచనలకు ఎల్లోమీడియా కూడా తాన అంటే తంధాన అన్నట్లుగా తయారైంది కద ? అందుకనే చంద్రబాబు పాలనలో జనాలకు వాస్తవాలు చెప్పకుండా భ్రమల్లో ముంచెత్తింది.

 

జనాలకు తాము ఎంత చెబితే అంత అని ఎల్లోమీడియా, ప్రజలను బుట్టలో వేసుకోవటం చాలా ఈజీ అని చంద్రబాబు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో ఇద్దరికీ గూబ గుయ్యిమనిపించారు జనాలు. అంటే ఎల్లోమీడియా రాతలను, చంద్రబాబు మాటలను జనాలు పట్టించుకోలేదని తర్వాత అర్ధమైపోయింది.

 

అదే సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ మ్యానిఫెస్టోలోను, పాదయాత్ర సందర్భంగాను ఇచ్చిన హామీలను అమల్లోకి తేవటం మొదలుపెట్టారు. చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయేటపుడు జగన్ కూడా ఖాళీ బొచ్చె అప్పగించారు. కాబట్టి ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేరని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో జగన్ తన హామీల అమలుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా నవరత్నాల పథకాల అమలుకు తేదీల షెడ్యూల్ కూడా ప్రకటించేశారు.

 

పాలనలో జగన్ వంద రోజుల స్పీడ్ చూసిన చంద్రబాబుకు బొమ్మ కనబడటం మొదలైంది. దాంతో ఎలాగైనా జగన్ ను అన్ పాపులర్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఏవోవే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చలో ఆత్మకూరంటూ టిడిపి కార్యకర్తలపై వైసిపి హత్యా రాజకీయాలు, దాడులంటూ నాటకాలు మొదలుపెట్టారు. మొత్తానికి 100 రోజుల పాలననే తట్టుకోలేని చంద్రబాబు ఐదేళ్ళ పాలనను ఎలా తట్టుకుంటారో ఏమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: