చలో ఆత్మకూరంటూ చంద్రబాబునాయుడు పది రోజుల పాటు చేసిన హడావుడిలో పుత్రరత్నం నారా లోకేష్ లో పదోశాతం కూడా కనబడలేదు. 70 ఏళ్ళ వయసులో చంద్రబాబులో ఉన్న స్పీడు లోకేష్ లో ఎక్కడా కనబడలేదు. అసలే లోకేష్ నాయకత్వంపై పార్టీలోనే ఎవరికీ నమ్మ కం లేదు. అలాంటిది చలో ఆత్మకూరు పిలుపుతో నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకోలేకపోయారంటే ఏమిటర్ధం ?

 

నిజానికి లోకేష్ అంటే చంద్రబాబు కొడుకు అన్న అర్హత తప్ప మరోటి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో చంద్రబాబు కొడుకు కాబట్టే అధికారంలో ఉన్నపుడు ఏదోలా చెలామణి అయిపోయారు. నేతల సామర్ధ్యం ఎప్పుడు కూడా కష్టాల్లో అంటే ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నపుడే బయటపడుతుంది. తమ సామర్ధ్యం నిరూపించుకునేందుకు కూడా ప్రతిపక్షంలో ఉండటమే మంచి సమయం కూడా.

 

అలాంటిది గడచిన మూడు నెలలుగా లోకేష్ కేవలం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైపోయి పచ్చి ప్రేలాపనలతో కాలం గడిపేస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే పార్టీ నేతలు, క్యాడర్లో ఉత్సాహం తీసుకురవాటానికి చంద్రబాబు చలో ఆత్మకూరు ను వాడుకోవాలని అనుకున్నారు. నిజానికి ఇది కూడా చంద్రబాబు చేసిన తప్పుడు ఆలోచనే.

 

ఏదేమైనా చంద్రబాబు పిలుపుతో కొండరు నేతలు రెచ్చిపోయి రోడ్లపై వీరంగం ఆడేశారు. అచ్చెన్నాయుడు, భూమా అఖిలప్రియ, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు రోడ్లపై పోలీసుల ముందు ఎంత హడావుడి చేశారో అందరూ చూసిందే. ఎవరి స్ధాయిలో వాళ్ళు రెచ్చిపోతుంటే లోకేష్ మాత్రం అదేమీ పట్టనట్లు ఇంట్లోనే ఉండిపోయారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న వందమంది నేతల్లో ఒకడిగా మారిపోయారు.

 

చివరకు చంద్రబాబు బయటకు పోకుండా పోలీసులు తమ ఇంటి గేటుకు తాళాలు వేస్తే వాటిని తెరిపించాల్సిన లోకేష్ చోద్యం చూస్తు నిలబడిపోయారు. లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగితే కచ్చితంగా హైలైట్ అయ్యేదే. ఎందుకంటే ఎల్లోమీడియా మొత్తం చంద్రబాబు ఇంటిముందే పడిగాపులు కాస్తోంది. కాబట్టి లోకేష్ కు మైలేజ్ రావటం పెద్ద కష్టం కూడా కాదు. కానీ లోకేష్ ఆ విషయాలేమీ ఆలోచించినట్లు లేదు. ఈ విషయంలోనే నేతల్లో చాలామంది లోకేష్ నాయకత్వంపై మండిపోతున్నారట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: