పాపం తన తండ్రి చంద్రబాబు మీద ఎవరో మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని లోకేష్ ఆవేదన చెందుతూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో జగన్ ను ఉద్దేశిస్తూ .. అసలు ఈ రాష్ట్రంలో సీఎం ఉన్నాడా  లేదా ఈ సర్కార్ కి మాజీ ముఖ్య మంత్రి మీద పెట్టిన మార్ఫింగులు కనిపించడం లేదా అంటూ లోకేష్ కామెడీ చేస్తున్నారు. నిజానికి మార్ఫింగ్ రాజకీయాలు గురించి లోకేష్ చెబుతుంటే ప్రజలు నవ్వొస్తుంది. ఏకంగా చంద్రబాబు ఆశా వర్కర్ల విషయంలో జగన్ మీద ఒక మార్ఫింగ్ పోస్ట్ అడ్డంగా దొరికిపోయిన తరువాత తొలిగించిన పరిస్థితి. అలాంటింది ఎవరో ముక్కు మొహం తెలియని వారు పెడితే లోకేష్ ట్విట్టర్ లో చిందులు వేస్తున్నారు. ఛలో ఆత్మకూరు అంటూ చేసిన హడావుడి ప్లాప్ అవ్వటంతో టీడీపీ బాగా నిరుత్సాహపడినట్టుంది. 


ఒక పక్క జగన్ వంద రోజుల పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. యువత పరీక్షల్లో బిజీ అయిపోయింది. రైతుల అకౌంట్ లో వచ్చే నెలలో పడబోతున్నాయి. ఏ ఈనెల చివరికల్లా ఆటో డ్రైవర్స్ కు పదివేలు డబ్బులు అందబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్కరు జగన్ పాలన పట్ల హ్యాపీగా ఉంటే .. చంద్రబాబు మాత్రం టీడీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని .. ఛలో ఆత్మకూరు అంటూ ప్రజలను పక్కదారి పట్టించే పని చేస్తున్నారు.


జగన్ కు ఎక్కడ మైలేజ్ వస్తుందేమోనని పక్కా ప్లాన్ ప్రకారం పెయిడ్ ఆర్టిస్టులతో హంగామా చేస్తున్నారు.  మొదటి వంద రోజులు జగన్ పరిపాలన చూశాక .. టీడీపీ ప్రభుత్వానికి .. వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో ఇట్టే చెప్పొచ్చు. మూడు నెలలో ఇచ్చిన హామీలను డేట్స్ చెప్పి మరీ అమలు చేస్తున్నారు. కానీ చంద్రబాబుకు ఆయన పుత్ర రత్నానికి ఇవేమి కనిపించడం లేదు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడినట్టు ఏ ఒక్క మంత్రి మీద గాని ఎమ్మెల్యే మీద గాని ఫిర్యాదు రాలేదు. ఇది ఒక్కటి చాలు జగన్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: