సాధారణంగా ఏదైనా శుభకార్యాలు చేస్తే ఇంటికి వచ్చిన అతిధులను ఎలా మెప్పించాల అని చూస్తుంటారు.  వారి స్థాయిని బట్టి వెజ్, నాన్ వెజ్ వంటకాలు, స్వీట్లు..పండ్లు ఇచ్చి సత్కరిస్తుంటారు.  పెళ్లి కార్డులపై ప్రత్యేకంగా విందు అని మెన్షన్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విందు కార్యక్రమంతోనే ఎవరి కెపాసిటీ ఎంత అనేది నిర్ణయిస్తుంటారు కొంతమంది పెద్దలు.  ఇటీవల తమిళనాడులో ఓ రైతు తాను అప్పుల్లో కూరుకు పోవడంతో ఏం చేయాలో పాలుపోని సందర్భంలో అనాధిగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించి విందు ఏర్పాటు చేశారు. 

అయితే వచ్చిన అతిథులు అతనికి ఇచ్చిన కానుకలు ఏకంగా నాలుగు కోట్లు రావడం ఈ న్యూస్ వైరల్ గా మారడం చూశాం.  తాజాగా ఇప్పుడు మరో వింతైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేరళలోని కొల్లాం జిల్లా సడ్తంకొట్ట ఆలయంలో వానరాలకు స్థానికులు విందు ఏర్పాటుచేశారు. పంచభక్ష్య పరమాన్నాలు అరటి ఆకుల్లో వడ్డించి రాచమర్యాదలు చేశారు.

ఇంతకీ ఈ అతిథి సత్కారాలు, మర్యాదలు విందు భోజనం ఎవరికి అంటారా..సాక్షాత్తు వానర సమూహానికి.. సాధారణంగా  ఓనం పండుగ రోజు ఇక్కడి వారు తమ బంధుమిత్రులకు మల్లే వానరాలకు పంచభక్ష్య పరమాన్నాలతో అతిథ్యం ఇచ్చి వాటిని సంతృప్తి పరుస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా తమ సంప్రదాయంలో భాగంగా దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని వారు కొనసాగిస్తున్నారు. వామనుడి చేతిలో హతమైన మహాబలి చక్రవర్తి ఆత్మ  పండగ రోజు వానరంలా వస్తుందని వారి నమ్మకం.

అందుకే 35 ఏళ్ల క్రితం అరవిందక్షణ్‌ నాయర్‌ అనే స్థానికుడు ఓనం పండగ రోజు ఇలా వానరాలకు విందు ఇచ్చే ఆచారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు వానరాలకు ఆతిథ్యం ఇస్తున్నారు.అప్పటి నుంచి ఏటా కులమతాలకు అతీతంగా ఆ ప్రాంత ప్రజలు వానరాలకు ఆతిథ్యం ఇస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా అలాగే రుచికరమై



మరింత సమాచారం తెలుసుకోండి: