జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ చాలా అంతర్ముఖుడు. బయట పెద్దగా మాట్లాడని జనసేనాని ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావడం చాలా మంది అభిమానులను ఆశ్చర్య పరిచింది అనే చెప్పాలి. హీరోలాగా పబ్లిసిటీకి హీరోయిజం కి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అతని అభిమానులకి అమూల్యమే... బయటకు వచ్చే చిన్న అప్డేట్ కి కూడా జనసైనికులు అంతా పండగ చేసుకుంటాడు. ఇప్పుడు అదే వరుసలో ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటోని తమ గ్యాలరీలో మరియు గుండెల్లో సేవ్ చేసుకుంటున్నారు పవన్ అభిమానులు.

ఈ బ్లాక్ ఆండ్ వైట్ ఫోటోలో పవన్ కళ్యాణ్ టీ-షర్టు మరియు నిక్కర్ తో నవ్వుతూ కనిపిస్తాడు. అయితే చిన్నప్పుడు మాత్రం మధ్యలోకి జుట్టును దువ్వకుండా చక్కగా పక్క పాపిడి తీసుకొని కనిపిస్తాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు బయటికి వచ్చిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. కుర్రకారు అంతా తమ సోషల్ మీడియా డీ.పీ లుగా ఈ ఫోటోని పెట్టుకుంటున్నారు.




ఇక రాజకీయాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఇంకా పల్నాడు గొడవలపై ఏమీ స్పందించలేదు. మొన్నటి వరకు అమరావతిలో రైతులతో కలిసి హల్ చల్ చేసిన జనసేనాని తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టి నిదానంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అతని అభిమానులు అంతా ఆయన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే తమ సత్తా చూపించాలి అని ఆశగా ఉన్నారు. మొన్ననే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి దాదాపు మూడు కోట్ల రూపాయలు అభిమానులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దీనికి పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా రియాక్ట్ అయ్యాడు కూడా. ఇప్పుడు విడుదలైన అతని చిన్ననాటి ఫోటో దానికి కానుకే కాబోలు.


మరింత సమాచారం తెలుసుకోండి: